Vishal Marriage: కోలీవుడ్ హీరో విశాల్ (Hero Vishal) మ్యారేజ్‌కు సంబంధించి రెండు, మూడు రోజులుగా వార్తలు ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. స్వయంగా తనే తన పెళ్లి గురించి ప్రస్తావించడంతో.. ఈసారి పక్కాగా విశాల్ పెళ్లి అవుతుందని అంతా అనుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే, ఓ నటిని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని విశాల్ చెప్పడంతో, ఎవరా నటి? అనేలా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సోషల్ మీడియా అంతా తెగ సెర్చ్ చేస్తున్నారు కూడా. అలా సెర్చ్ చేసే వారందరికీ విశాల్ పెళ్లి చేసుకోబోతున్న నటి ఎవరో ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని తెలుస్తోంది. ఇంతకీ విశాల్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె (Super Star Rajinikanth Daughter)ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడట. షాకయ్యారా! అసలు విషయం ఏమిటంటే..
Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇటీవల ఓ కుమార్తె విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం విడాకుల ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రజనీ కుమార్తెను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటే.. కచ్చితంగా ఆయన పెళ్లి చేసుకోబోయేది రెండో మ్యారేజ్ అమ్మాయిని అని అంతా అనుకోవడం సహజమే. కాకపోతే, రజనీకాంత్ కుమార్తెలెవరూ నటీమణులు కాదు కదా. ఇదే హింట్. ఈ దాగుడుమూతలు ఎందుకులేగానీ, టైటిల్‌లో చెప్పిన రజనీకాంత్ కుమార్తె ఎవరంటే.. ‘కబాలి’ సినిమాలో సూపర్ స్టార్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక. అవును, విశాల్ మ్యారేజ్ చేసుకోబోతున్న నటి ఆమెనే అని కోలీవుడ్ మీడియా రివీల్ చేసేసింది. కత్తిలాంటి హీరోయిన్‌ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుపుతూ, సాయి ధన్సిక పేరును అక్కడి మీడియా హైలైట్ చేస్తోంది. మరి నిజంగా ఆమెనే విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడా? లేదంటే ఇది కూడా ఇంతకు ముందు వచ్చిన రూమర్‌లాంటిదేనా? అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ విషయం చెప్పాల్సింది మాత్రం విశాలే.
Also Read- Jr NTR Birthday: తారక్ బర్త్‌డే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్!
సాయి ధన్సిక (Sai Dhanshika) అంటూ మరీ ఇంతగా వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ అటు విశాల్‌గానీ, ఇటు సాయి ధన్సిక గానీ ఇంత వరకు రియాక్ట్ కాలేదు. ఇక విశాల్ చెప్పినదాని ప్రకారం, ఆయన పెళ్లి నడిఘర్ సంఘం భవనం పూర్తవ్వగానే, అందులో మొదటి మ్యారేజ్ తనదేనని ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పాడు. ఆ భవనం రెండు నెలల్లో పూర్తవుతుందని తెలుస్తుంది. భవనం ప్రారంభోత్సవం పూర్తవ్వగానే తన ప్రేయసి ఎవరో చెప్పి, పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తానని ఇటీవల విశాల్ తెలిపారు. మొత్తంగా అయితే విశాల్‌కు కళ్యాణ ఘడియలు (Vishal Marriage Update) దగ్గర పడినట్లే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో? ఇప్పటి వరకు విశాల్ పెళ్లి విషయంలో వరలక్ష్మీ శరత్ కుమార్, అభినయ పేర్లు వినిపించాయి. ఈ నటీమణులిద్దరి పెళ్లిళ్లు పూర్తయ్యాయి. అలాగే అనీషా అనే నటితో విశాల్ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, ఆ నిశ్చితార్థం రద్దయింది. ఇలా ఎప్పుడూ విశాల్ పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్‌గానే నడుస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు