YSRCP Raising
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YSRCP: సీన్ రివర్స్.. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ విజయదుందుభి..

YSRCP: అధికార కూటమిని ధీటుగా ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. రాష్ట్రంలో సోమ‌వారం జ‌రిగిన ప‌లు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ విజయదుందుభి మోగించింది. ఏక‌గ్రీవంగా ఎన్నికై ప‌లు మున్సిపాలిటీలు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌ను సొంతం చేసుకున్నది. గ్రేటర్‌ విశాఖపట్నంతో పాటు మరో 4 మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు ఇవాళ మరో విడత ఎన్నికలు జరిగాయి. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ పదవితో పాటు బొబ్బిలి (విజయనగరం జిల్లా), ఆదోని (కర్నూలు జిల్లా), తిరువూరు (ఎన్టీఆర్‌ జిల్లా), కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా) మున్సిపాలిటీల ఛైర్మన్‌ పదవులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. మరోవైపు.. చాలా చోట్ల కోరం లేక ఎన్నిక‌ వాయిదా పడింది. ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠాన్ని వైసీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సీహెచ్. లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Inukonda Dhanalakshmi

మంత్రి ఇలాకాలో ఎగిరిన వైసీపీ జెండా..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి నిలిచింది. ఎంపీపీ స్థానాన్ని ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యలమంచిలి ప్రాంతం పాలకొల్లు నియోజకవర్గంలోనిది. పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Rama Naidu) ఇలాకా. అయితే మంత్రి ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైసీపీ దక్కించుకోవడం గమనార్హం. కూటమి నేతల కుట్రలు పన్నినా, తమ పార్టీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురించేసినా లొంగలేదని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార పార్టీ, అందులోనూ మంత్రి అడ్డాలో వైసీపీ పాగా వేయడం మామూలు విషయమేమీ కాదు.

Read Also- KCR: కేసీఆర్ స్కెచ్.. కేటీఆర్ అమలు.. ఫైనల్‌గా ఏమైంది?

చ‌క్రం తిప్పిన తాటిపర్తి..
త్రిపురాంతకం వైస్ ఎంపీపీ ఎన్నిక‌లో వైసీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్రశేఖ‌ర్ (Tatiparthi Chandra Sekhar) తనదైన శైలిలో చ‌క్రం తిప్పారు. వైసీపీ మేడపి ఎంపీటీసీ పాటిబండ్ల కృష్ణ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను దగ్గరుండి యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పర్యవేక్షించారు. గెలుపు తర్వాత.. సీఎం చంద్రబాబు కుట్రలను వైసీపీ సమర్థంగా తిప్పికొట్టిందని తాటిపర్తి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక కూటమి ఆటలు సాగవని.. ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ జెండానే ఎగురుతుందని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

Tripuranthakam

కంబ‌దూరు వైసీపీ వ‌శం
కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య (Talari Rangaiah) నేతృత్వంలో కంబదూరు వైస్ ఎంపీపీ ప‌ద‌విని వైసీపీ వ‌శం చేసుకున్నది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేర‌కు ఎంపీటీసీ స‌భ్యుడు వంటరెడ్డిపల్లి యనమల సోమశేఖర్‌ను కంబదూరు ఎంపీటీసీలు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు పాల్లూరు ఎంపీటీసీ శ్రీదేవి చాలా రోజుల నుండి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో.. ఈ విషయాన్ని ఆమె భర్త తిమ్మారెడ్డి పార్టీ పెద్దలకు తెలిపారు.

Adoni

రామ‌గిరిలో టీడీపీకి షాక్‌
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి (Telugu Desam) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైసీపీకి-08, టీడీపీకి-01 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్‌ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Read Also- Shrasti Verma : శ్రేష్టి వర్మకు మరో బిగ్ షాక్.. ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారా?

తిరువూరులో రచ్చ రచ్చ!
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పెద్ద రచ్చే జరిగింది. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) నానా హడావుడి చేశారు. వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటం గమనార్హం. ఆఖరికి బారికేడ్లు తోసుకెళ్లి మరీ కొలికపూడి దౌర్జన్యం చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కౌన్సిలర్లపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారని.. ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఓడిపోతామనే భయంతో ఎన్నికలు జరగకుండా టీడీపీ వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు కనీసం చెదరగొట్టడానికి కూడా సాహసించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నది. మొత్తం 17 మంది వైసీపీకి , టీడీపీకి ముగ్గురు మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. అయితే బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు చేస్తున్నదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తిరువూరు మున్సిపాలిటీని బలవంతంగా లాక్కునేందుకు కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను పర్యవేక్షించేందుకు వెళ్ళాల్సిన ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావును ఇంట్లోనే పోలీసులు బంధించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన నడుస్తోంది అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని తన్నీరు మండిపడుతున్నారు.

Tiruvuru TDP

Read Also- YSRCP: ఆ ఒక్క పని చేసుంటే వైసీపీ గెలిచేదా..? ఘోర తప్పిదానికి కారణమెవరు?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?