Sorry Lord Venkateswara
ఆంధ్రప్రదేశ్

Tirupati: పవిత్ర పుణ్యక్షేత్రంలో మహా పాపం.. ఏం జరిగిందంటే?

Tirupati: అవును.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన టెంపుల్ సిటీలో మద్యం ఏరులై పారుతోంది. లక్షలాది భక్తులు శ్రద్ధా భక్తులతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే పవిత్ర క్షేత్ర పరిధిలో ఇప్పుడు అత్యంత బాధాకరమైన దృశ్యం కనబడుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం షాపులు ఎక్కడున్నాయంటే.. అది ఏ వాణిజ్య నగరంలోనో కాదు తిరుపతిలోనే! గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతి.. ఇప్పుడు మద్యం మత్తులో జోగేలా కూటమి ప్రభుత్వం చేస్తోందని నగరవాసులు తిట్టిపోస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. పొద్దున్నా, రాత్రైనా తేడా లేకుండా 24/7 మద్యం అమ్మకాలు జరుగుతుండటం గమనార్హం. తెల్లవారుజామున 5.20 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అవుతున్నాయి. వైసీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పరిశీలనలో ఈ షాకింగ్ విషయాలన్నీ బట్టబయలు అయ్యాయి. వేంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తిరుపతిలో అడుగుపెట్టగానే మందుబాబులు, మద్యం బాటిల్లు ప్రత్యక్షమవుతున్నాయి. గుడులు, బడులు తెరవకముందే, వైన్ షాపులు తెరుస్తున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉదయాన్నే పిల్లలు ఇంటి దగ్గర నుంచి బడికి వెళ్ళాలంటే కనీసం రెండు నుంచి మూడు మద్యం దుకాణాలు దాటాల్సిన పరిస్థితి. ఇది కుటుంబాలకు, సమాజానికి, భక్తులకు తలనొప్పిగా మారిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also- Big Breaking: తెలంగాణలో మందుబాబులకు ఉహించని షాక్.. అంతా గందరగోళం

ఇదేనా సంపద సృష్టి?
సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తమ పార్టీ నాయకుల జేబులు నింపడానికి విచ్చలవిడిగా మద్యం షాపులతో నింపేశారని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నది. ఇది కేవలం తిరుపతి మాత్రమే కాక, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. తిరుపతిలో అయితే మద్యం షాపులు మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గొడవలు, ప్రమాదాలు, కుటుంబాల పతనం.. ఇవన్నీ సామాన్యమైన విషయాలుగా మారిపోయాయి. ఒకవైపు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ ప్రభుత్వం మీద మద్యం స్కామ్ అని ఆరోపణలు చేస్తోంది. తమ తప్పులను దాచుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. ఇదేనా మీ పాలన మార్పు?, మందు బాబులతో మాత్రమే సంపద సృష్టిస్తారా? అని వైసీపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ప్రభుత్వ నియమాలు ప్రకారం మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే ఓపెన్ ఉండాలి. కానీ తిరుపతిలో మాత్రం ఉదయం 5:30 నుంచే మొదలై సుమారు రాత్రి 2 గంటల వరకు, అంటే ఏకంగా 21 గంటలు నిబంధనలు లెక్కచేయకుండా షాపులు నడుస్తుండటం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న భూమన అభినయ్ రెడ్డి స్వయంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మద్యం షాపుని ఉదయం 6 గంటలకు తనిఖీ చేశారు. అక్కడ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి ని అడగగా ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి మద్యం విక్రయిస్తామని ఈ విషయం ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా తెలుసని చెప్పకనే చెప్పారు.

Bhuma Abhinay

ఏ షాపు ఎన్ని గంటలకు?
తెల్లవారుజామున భూమన అభినయ్ తిరుపతిలో 10-15 మద్యం దుకాణాలను తనిఖీ చేయగా, ఒక్కో బాటిల్‌పై రూ.50 అదనంగా వసూలు చేస్తూ, పగలు-రాత్రి అనే తేడా లేకుండా చట్టవిరుద్ధంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తేలింది. ప్రజల ముందు లైవ్ వీడియోలో ఈ అక్రమాలు బట్టబయలు చేశారు. నైన్ స్టార్ వైన్స్, తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన ఉదయం 6:00 గంటలకే, హరి వైన్స్, ఎస్‌టివి నగర్‌లో 5:27 గంటలకే, రాజీవ్ గాంధీ కాలనీ జీవకోనలో 6:13 గంటలకు, సత్యనారాయణపురం రోడ్డు జీవకోనలో 5:49 గంటలకే, ఎస్‌వి బార్, గ్రూప్ థియేటర్స్‌కు ఎదురుగా బస్టాండ్ పక్కన 5:59 గంటలకే, జయ్ శ్యామ్ థియేటర్ పక్కన 6:08కు, విక్టరీ వైన్స్, వైకుంఠపురం ఆర్చ్ దగ్గర 6:09కే, కేకే వైన్స్, అకారం పల్లి రోడ్డు 5:37 కే, విక్టరీ వైన్స్, ఎంఆర్ పల్లి రోడ్డు 5:14 గంటలకు, విక్టరీ వైన్స్, దేవేంద్ర థియేటర్ దగ్గర 6:00, బడి బార్, లీలామహల్ సర్కిల్ రాత్రి 12:10, హారిక బార్, అలిపిరి రోడ్డు రాత్రి 12:10, బడి వైన్స్, డిబిఆర్ రోడ్డు అర్ధరాత్రి 1:00 వరకూ ఓపెన్‌లోనే ఉండటం గమనార్హం. చూశారుగా ఉదయాన్నే ఏ టైమ్‌లో ఓపెన్ అవుతున్నాయో, రాత్రి ఏ సమయానికి మూత పడుతున్నాయో ఇదీ తిరుపతిలో వైన్ షాపుల పరిస్థితి.

Bhumana Abhinay

బాధ్యత ఎవరిది?
ఇంకా విచారకరం ఏంటంటే, ఆ మద్యం షాపు పర్మిట్ రూములో మద్యం తాగుతున్న వ్యక్తి ఒక యాత్రికుడు అని తేలింది. తెల్లవారుగాముపైన నాలుగు గంటలకు రైలు దిగిన వెంటనే నేరుగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మద్యం షాపుకే వచ్చి తాగడం ప్రారంభించానని, తాగిన తర్వాత తల స్నానం చేసి దర్శనానికి వెళ్తానని అన్నాడు. కచ్చితంగా ఇది హిందూ సాంప్రదాయాలకు, హిందూ భక్తుల మనోభావాలకు , తిరుమల పవిత్రతకు తూట్లు పొడవడమే అని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులకు రైల్వే స్టేషన్ దగ్గరగా అనుమతులు ఎవరు ఇచ్చారు?, ఎవరు నిబంధనలు తుంగలో తొక్కి లంచాలు తీసుకుంటున్నారు?, ఇది కేవలం చట్ట ఉల్లంఘన కాదు, ముమ్మాటికీ ఇది హిందూ భక్తి సాంప్రదాయాలపై దాడిగా పరిగణించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సనాతన ధర్మ పరిరక్షకునిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read Also- Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?

 

 

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..