Crime News: భార్య ను కాపురానికి తీసుకెళ్లేందుకు వచ్చిన అల్లుడు పై భార్య మౌనిక, మామ వీరన్న, అత్త కైలా, కంట్లో కారం చల్లి ఆ పైన కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న అల్లుడిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో ఆదివారం చోటు చేసుకుంది.
మహబూబాబాద్ డి.ఎస్.పి ఎన్ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. బల్లార్షా ప్రాంతానికి చెందిన లకావత్ బాల కు కేసముద్రం మండలం ధర్మారం తండాకు చెందిన మౌనికకు గత కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వారు ఇరువురికి ఇద్దరు కుమారులు. కాగా, గత మూడు రోజుల క్రితం మౌనిక భర్తతో గొడవ పెట్టుకుని తన తల్లిదండ్రుల ఉంటున్న ధర్మారం తండాకు వచ్చింది.
Also read: Nandigam Suresh: నందిగం సురేష్ మళ్లీ అరెస్ట్.. ఇక కష్టమేనా!
ఈ క్రమంలోనే లకావత్ బాల మౌనికను కాపురానికి తీసుకెళ్దామని ఆదివారం అత్తవారింటికి వచ్చాడు. దీంతో భార్య మౌనికకు భర్త బాల కు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. మామ బానోత్ వీరన్న, అత్త కైలా, భార్య మౌనికలు బాల కళ్ళల్లో కారం చెల్లారు. ఇదే అదునుగా భావించిన భార్య, మామ, అత్త లు బాలపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో వెనుక భాగం నుంచి బలంగా బాలాను కత్తితో పొడవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
గమనించిన స్థానికులు మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. కాగా, బాల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి తిరుపతిరావు వెల్లడించారు. కాగా, ఈ దుశ్చర్యకు మౌనికకు మరో వ్యక్తి ఇల్లీగల్ సంబంధం కారణమేనని తెలుస్తోంది.