Vijay Sethupathi: విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Makkal Selvan Vijay Sethupathi). ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే, విజయ్ సేతుపతి నటించే సినిమాలో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అంతా నమ్ముతుంటారు. ఆయన హీరోగా చేసినా, విలన్‌గా చేసినా, లేడీ గెటప్ వేసినా.. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అందుకే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ పెరుగుతూ వస్తుంది. అలాంటి విజయ్ సేతుపతి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్’ (Ace Movie). ఈ మూవీని 7CS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అరుముగ కుమార్ నిర్మించారు. ఈ మూవీ తెలుగు హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తుంది.
Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!
విజయ్ సేతుపతికి తెలుగు ప్రేక్షకులలో కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. అందుకే ఈ మధ్య విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ‘ఏస్’ సినిమా తెలుగు రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకు శ్రీ పద్మిణి సినిమాస్ సంస్థ దక్కించుకుంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివ ప్రసాద్ ఈ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి ‘ఏస్’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా కూడా చివరికి శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానరే చేజిక్కించుకుంది. బి. శివ ప్రసాద్ దర్శక, నిర్మాణంలో ఇది వరకు ‘రా రాజా’ అనే సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది.
Also Read- Jr NTR Birthday: తారక్ బర్త్‌డే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్!
ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ఈ ‘ఏస్’ చిత్రాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాత బి. శివ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సినిమా మా సంస్థకు ఎంతో గర్వకారణం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించి, మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. అందుకే పోటీ పడి మరీ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నాం. విజయ్ సేతుపతి రేంజ్‌ని తెలిపేలా విడుదలను ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ‘ఏస్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతాన్ని అందించగా.. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చారు. విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో ఆయన ఇప్పటి వరకు పోషించని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు