Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా లోని పూనుగుండ్ల లో ఓ తునికాకు కాంట్రాక్టర్ అమానవీయ చర్యలకు పాల్పడ్డాడు. 40 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు.. అది మిట్ట మధ్యాహ్న సమయం చిన్న పిల్లలు అనే దయ, కనికరం లేకుండా తునికాకు కళ్ళంలో చిన్నారుల చేత కూలీ పనులు చేయిస్తున్నారు.
పెద్దవారితో పనులు చేయిస్తే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, అదేవిధంగా కూలీ డబ్బులు మిగులుతాయనే వక్ర బుద్ధితో ఓ కాంట్రాక్టర్ కక్కుర్తిపడి తునికాకు కట్టలను చిన్నారుల చేత దులిపిస్తున్నాడు. చిన్న పిల్లలకు రూ.20 ఇస్తానని ఆశ చూపి మండుటెండలో కల్లంలో పనులు చేయించడం మండలంలో చర్చనీయాశంగా మారింది.
Also read: Maheshwar Reddy On BRS: త్వరలో కవిత తిరుగుబాటు.. హరీష్‌కు రేవంత్ సపోర్ట్.. బీజేపీ నేత
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల యూనిట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గంగారం మండలంలోని పునుగొండ్ల గ్రామంలో తునికాకు సేకరిస్తున్నాడు. గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి కట్టలు తడిశాయి.
వాటిని దులుపుకుంటూ తిప్పి పెట్టాల్సి ఉంటుంది. అందుకు పెద్దవారిని పనికి పెట్టుకుంటే కూలీ రూ.400 ఇవ్వాల్సి వస్తుంది. ఆ సమయంలోనే అటువైపుగా వచ్చి ఆడుకుంటున్న చిన్నారులతో పని చేయించి డబ్బులను మిగిల్చుకోవాలని అనుకున్నాడు.
Also read: Maoists Surrender: పోరు కన్నా, ఊరు మిన్నా.. ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు!
కక్కుర్తితో స్థానికంగా కనిపించిన చిన్నారులకు 1000 కట్టల తిప్పివేస్తే రూ.20 ఇస్తానని చెప్పి మండుటెండ లో పనులు చేయించుకుంటున్నాడు. ఈ ఘటన సెల్ ఫోన్లు చిత్రీకరించిన కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో తునికాకు కళ్ళంలో పనిచేస్తున్న చిన్నారుల వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది.