Maoists Surrender(image credit:X)
నార్త్ తెలంగాణ

Maoists Surrender: పోరు కన్నా, ఊరు మిన్నా.. ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు!

Maoists Surrender: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఉద్దేశంతో “పోరు కన్నా..ఊరు మిన్నా”కార్యక్రమం అత్యుత్తమ ఫలితాలను ఇస్తోంది. అదేవిధంగా అజ్ఞాతంలో ఉండి లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలకు ఆకర్షితులై హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వదిలిపెట్టి కుటుంబాలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు శనివారం ములుగు జిల్లా ఎస్పీ పి శబరిష్ ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు
చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంజర గ్రామానికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు, కంపెనీ వన్ లో ఫ్లాట్ టోన్ కమాండర్, మూడు డివిజనల్ కమిటీ సభ్యుడు మడకం ఐతా, ఇదే రాష్ట్రం ఇదే జిల్లా, జాగురుగొండ పరిధికి చెందిన తాము సన్నీ, సుకుమా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధి గంగరాజు పాడు గ్రామానికి చెందిన కోవాసి దేవి, బీజాపూర్ జిల్లా టెర్రం పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద బట్టి గూడెం గ్రామానికి చెందిన ఓయం దేవి, ఉసురు పోలీస్ స్టేషన్ పరిధి సింగం గ్రామానికి చెందిన సోడి ఐతే, పామిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొమ్ముగూడ గ్రామానికి చెందిన మడకం కోసి, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి చెలిమెల గ్రామానికి చెందిన మచ్చకి భామన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మవరం గ్రామానికి చెందిన మడకం ఐతే లు మొత్తం ఎనిమిది మంది వివిధ క్యాడర్లలో పనిచేసే మావోయిస్టులు ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఎదుట లొంగిపోయారు.

Also read: WE Hub Women Acceleration: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆడ బిడ్డలకు ప్రత్యేక ఐడీ కార్డులు!
లొంగిపోయిన వారికి పునరావాసం
మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితులై ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు దూరమై జీవితం సర్వస్వం కోల్పోయి ఇక మావోయిస్టుల్లో పనిచేస్తే శూన్యమేనని నమ్మిన మావోయిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వారికి పునరాసనం కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇప్పటివరకు వారిపై కేటాయించిన రివార్డులను వారి బ్యాంకు ఖాతాలో డీడీల ద్వారా జమ చేస్తామని వెల్లడించారు.

అదేవిధంగా వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారందరికీ ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యాన్ని అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమన్నారు. పునరావసంలో భాగంగా వారికి కావలసిన అన్ని వసతులను సమకూర్చడమే పోలీసుల కర్తవ్యమని స్పష్టం చేశారు.
జనవరి నుండి నేటి వరకు
జనవరి 2025 నుండి నేటి వరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న నిషేధిత సిపిఐ మావోయిస్టులు డివిజన్ కమిటీ సభ్యులు ఒక్కరు, ఏరియా కమిటీ సభ్యులు ఆరుగురు, పార్టీ సభ్యులు 11 మంది, మావోయిస్టు పార్టీకి చెందిన జనతన సర్కారులు వివిధ సంఘాల నుండి మలేషియా, ఆర్పిసి, సిఎన్ఎం, డి ఏ కె ఎం ఎస్ లలో పనిచేసిన 33 మంది సహా మొత్తం 52 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు.

Also read: Miss World 2025 Beauties: తారక్ పాటకు దుమ్మురేపిన అందాల భామలు.. మీరూ చూసేయండి!

భారతదేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆకర్షితులైన వివిధ కేడర్లు పనిచేస్తున్న మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులైతున్నారు అని తెలిపారు.

 

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?