Miss World 2025 Beauties: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. వివిధ విభాగాల్లో అందాల భామలు తలపడుతున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణరావు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ పోటీలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
దేవర పాటకు స్టెప్పులు
తారక్ హీరోగా నటించిన దేవర సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందులోని ఆయుధ పూజ సాంగ్ లో జూ.ఎన్టీఆర్ తన స్టెప్పులతో దుమ్మురేపారు. తద్వారా తన ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించారు. అయితే అటువంటి సాంగ్ కు.. ప్రపంచ సుందరీమణులు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. దీంతో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి.
దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు స్టెప్పులేసిన ప్రపంచ సుందరీమణులు#MissWorld2025 #Devara pic.twitter.com/0p2JUcGmSf
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2025
డీజే బీట్‌కు సైతం
మరోవైపు తెలంగాణలో డీజే సాంగ్స్ కు ఎంత క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ సుందరీమణులు ఉన్న గచ్చిబౌలి ఇంటోర్ స్టేడియంలో ఒక్కసారిగా డీజే మోతలు హేరెత్తించాయి. దీంతో అక్కడి మిస్ వరల్డ్ అందాల భామలు తమదైన స్టెప్పులతో అలరించారు. మాస్ బీట్ కు అనుగుణంగా గాల్లోకి ఎగురుతూ సందడి చేశారు. దీంతో ఇండోర్ స్టేడియమంతా సందడిగా మారింది. నృత్యకారులను అనుసరిస్తూ వారు వేసిన స్టెప్స్ వీక్షకులను ఫిదా చేశాయి. మీరు కూడా ఆ దృశ్యాలను చూసేయండి.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్ లో డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మిస్ వరల్డ్ బ్యూటీస్. #MissWorld2025 #missworldhyderabad https://t.co/xwETzZlGJT pic.twitter.com/QmVneA5wLS
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2025