KTR - Harish rao (imagecredit:twitter)
Politics

KTR – Harish rao: హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ.. గులాబీ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

KTR – Harish rao: బావ బావమరుదుల భేటీ రాజకీయ చర్చకు దారి తీసింది. అసలు ఎందుకు భేటీ అయ్యారు. ఇప్పుడే ఎందుకు కలవాల్సి వచ్చింది. పార్టీలో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అయింది. గులాబీ పార్టీపై రోజుకో సరికొత్త చర్చ జరుగుతున్న వేళ, తాజా రాజకీయాలపై మాట్లాడారా, ప్రభుత్వాన్ని కలిసికట్టుగా నిలదీసేందుకు సిద్ధమయ్యారా, అసలు ఇద్దరూ ఏం చేయబోతున్నారనేది అటు పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నది.

హరీశ్ ఇంటికి కేటీఆర్

హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. బావ బావమరుదులు ఇద్దరు కలిసి సుదీర్ఘంగా సుమారు 2 గంటలకు పైగా చర్చించారు. ఏం మాట్లాడుకున్నారనేది సస్పెన్స్. ఈ నేపథ్యంలో ఇద్దరు కలవడానికి కారణం ఏమిటనేది చర్చకు దారి తీసింది. తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. అదే విధంగా హరీశ్ రావు తండ్రి అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈమధ్యే డిశ్చార్జ్ కావడంతోనే కేటీఆర్ వెళ్లినట్లు సమాచారం. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఇద్దరు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నమా?

మరోవైపు, హరీష్ రావు పార్టీ మారుతున్నారని, అధిష్టానం, కేటీఆర్‌తో గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తామని తొలుత అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత హరీశ్ చెప్పిన స్థలంలో కాకుండా మరోచోట సభ నిర్వహించారు. దీంతో హరీశ్ రావు కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. దీనికి చెక్ పెట్టడానికే ఇద్దరు భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. కుటుంబంలో ఎవరికీ విభేదాలు లేవని అంతా కలిసికట్టుగా ఉన్నామనే మెసేజ్ ఇవ్వడానికే భేటీ అయ్యారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా పార్టీ పగ్గాలు కేటీఆర్‌కు అప్పగించినా పని చేస్తానని, కేసీఆర్ చెప్పిన లైన్ దాటనని హరీశ్ ఈమధ్యే స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని అన్నారు. ఈ తరుణంలో ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Also Read: Congress Leaders: కాంగ్రెస్‌లో రగడ.. రోడ్డెక్కిన నేతలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు..

కలిసికట్టుగా ముందుకు పోదాం

వరంగల్ సభ సక్సెస్‌తో కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని దానిని కలిసికట్టుగా ఎదుర్కొంటామని కేటీఆర్, హరీశ్ రావు నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా ప్రభుత్వ వైఫల్యాలపై బాగా పని చేశామని ఇంకా బాగా పని చేయాలని చర్చించినట్లు తెలిసింది. వరంగల్ సభ సక్సెస్‌తో పార్టీ క్యాడర్‌లోనూ జోష్ వచ్చిందని ఇదే విధంగా ముందుకు పోదామని ఇద్దరు పేర్కొన్నట్లు సమాచారం. బలమైన ప్రతిపక్షంగా ఉన్న పార్టీని బలహీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని తిప్పికొట్టాలని హరీశ్ రావు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, వైఫల్యాలపై ఆరోపణలపై దీటుగా సమాధానం చెబుదామని చెప్పారు. రైతు సమస్యలతో పాటు హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ, లగచర్ల, రైతు రుణమాఫీపై ఎండగడుతూ వచ్చామని సక్సెస్ అయ్యామన్నారు. ఇక నుంచి అంశాల వారీగా ముందుకుపోదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దామని కేటీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. సభ జోష్‌తో మరింత స్పీడ్‌గా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రభుత్వంపై ఎదురుదాడి చేద్దామని, పార్టీ క్యాడర్‌లోనూ మరింత జోష్ నింపుదామని ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను, అనుసరిస్తున్న విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడదామని ఇద్దరు నిర్ణయించినట్లు తెలిసింది. భవిష్యత్‌లో సాగు నీటి రంగంపైనా పోరాట బాట పట్టాలని అందుకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆధిపత్య పోరు.. అమెరికాకు షిఫ్ట్ అవుతుందా?

ఎల్కతుర్తి సభ సమయంలో అంతా హరీశ్ చూసుకుంటారని అనుకుంటున్న సమయంలో కవిత, కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి హరీశ్‌ను వెనక్కి నెట్టారు. వారి ఆధిపత్య దూకుడుతో రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయి వాటిని ఆయన ఖండించారు. కేసీఆర్ మాటే తనకు శిరోధార్యమని, కేటీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఓకే చెప్పారు. ఇంకోవైపు, కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కవిత వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఆమె అమెరికా వెళ్లడం, త్వరలో కేటీఆర్, కేసీఆర్ కూడా వెళ్తారని ప్రచారం జుగుతుండడంతో ఆధిపత్య పంచాయితీ అక్కడకు షిఫ్ట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే 2 గంటలకు పైగ కేటీఆర్, హరీశ్ రావు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Centre on Ration: రేషన్ కార్డు దారులకు భారీ శుభవార్త.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?