Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (CM Chandrababu).. టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం నివాసంలో బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ నవ్వు, ఆత్మీయ లింగనం చూస్తే బండ్ల ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలతో పలు అంశాలపై సుమారు అరగంటపాటు చర్చించినట్లుగా తెలిసింది. ‘ మీ పరిపాలన అద్భుతంగా ఉంది సార్.. మరో పదేళ్లు మీరే సీఎంగా ఉండాలి.. ఉంటారు కూడా’ అని బాబుకు బండ్ల కితాబిచ్చారట. ముఖ్యంగా ఏపీలో ఓ ముఖ్యమైన ప్రాజెక్టు విషయమై చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అది కూడా కొందరమే స్టూడియో అంటుండగా, మరికొందరేమో వ్యాపార వ్యవహారాలే అని తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే వ్యాపారం చేస్తున్న బండ్ల.. ఏపీలో తన వ్యాపారాలను విస్తరించాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే కొన్ని అనుమతుల కోసం నేరుగా చంద్రబాబునే కలిశారని తెలుస్తున్నది. సంబంధిత మంత్రి, అధికారులకు ఒక్క మాట చెప్పాలని సీఎంను గణేష్ కోరినట్లుగా తెలిసింది. కాగా, చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలిసారి భేటీ అయ్యారు.
Read Also- Tirumala: టీటీడీకి ఎన్నారై భారీ విరాళం.. తిరుమలలో భారీ భద్రత
పెద్ద ఫ్యాన్!
చంద్రబాబు అంటే బండ్ల గణేష్‌కు ఎంతో అభిమానం. బాబుకు డై హార్డ్ ఫ్యాన్. ఎన్నో సందర్భాల్లో, కమ్మ సామాజిక వర్గం నిర్వహించే సమావేశాల్లో బాబు గురించి ఏ రేంజిలో స్పీచ్‌లు ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘చంద్రబాబు అంటే పేరు కాదు బ్రాండ్.. మనిషి కూడా కాదు.. దేవుడు.. చంద్రబాబు కోసం చచ్చిపోతా’ అని మాట్లాడిన సందర్భం కూడా ఉంది. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. ‘చంద్రబాబు జైల్లో ఉండటంతో మేం పండుగలు చేసుకోవట్లేదు. కనీసం దీపావళి అయినా జరుపుకుంటాం అన్న నమ్మకంతో ఉన్నాం. చంద్రబాబు జాతీయ సంపద. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వార్త వినగానే నేను ఎంతో బాధపడ్డా. నాకు అన్నం కూడా తినాలని అనిపించలేదు. ఎన్ని కోట్లయినా సరే ఖర్చుపెట్టుకుంటాం.. చంద్రబాబును నిజాయితీగా బయటకు తీసుకొస్తాం’ అని కూడా బండ్ల అప్పట్లో ఆవేశంగా మాట్లాడారు. ఈ మధ్యనే ఏడేళ్లుగా అంతు చిక్కని, పరిష్కారం కాని సమస్య కేవలం నిమిషాల్లో సమసిపోయిందని.. అది కూడా రెండు రోజుల్లోనే పూర్తయ్యిందని.. అదీ చంద్రబాబు ఘనత అంటూ చెప్పుకొచ్చారు.
పవన్‌ను మరిచిపోయారా?
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) బండ్ల గణేష్‌కు మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుగు ప్రజలకు, సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్‌ను దైవంగా కొలుస్తుంటారు. ఎందుకంటే బండ్ల బాగా డౌన్ ఫాల్‌లో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ సినిమా నిలబెట్టింది, సక్సెస్‌ఫుల్ నిర్మాతగా మార్చింది కూడా. అంతకుముందు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. అందుకే పవన్ అంటే తనకు ప్రాణం అని చెబుతుంటారు. ‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అని బండ్ల డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతా సరే కానీ.. అమరావతికి వెళ్లిన గణేష్.. పవన్ కళ్యాణ్‌ను కలవకుండానే రావడమేంటి? కొంపదీసి ఇద్దరికీ పడట్లేదా? లేదా పవన్ బిజీబిజీగా ఉన్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్న పరిస్థితి. దేవుడికి పూజారి మధ్య గ్యాప్ వచ్చిందేంటి? అని విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా షూటింగ్‌లో పవన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పోనీ.. ఇది కూడా పక్కనెడితే తన అభిమాన దేవుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఇంతవరకూ ఎందుకు కలవలేదు? ఆయన అక్కర్లేదా? చంద్రబాబును మాత్రమే ఎందుకు కలిసినట్లో అని జనసేన కార్యకర్తలు, అభిమానులు కొందరు నిట్టూరుస్తున్నారు. ఈ వార్తలపై బండ్ల ఏమంటారో..? పవన్‌ను ఎప్పుడు కలుస్తారో చూడాలి మరి.
Read Also-Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?