Anasuya: అనసూయ.. టాలీవుడ్‌లో ఎందరో కలలరాణి. సినిమాలు, బుల్లితెర ప్రోగ్రామ్స్‌తో బిజీబిజీగా ఉంటే అనసూయ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ నెటిజన్లతో టచ్‌లోనే ఉంటుంది. రీసెంట్‌గా నూతన గృహప్రవేశం చేసిన అనసూయ.. ఆ ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టడం విశేషం. ఇక ఎప్పుడూ వార్తలలో ఉండే నటీమణుల్లో అనసూయ ఒకరనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీర కట్టినా, చుడిదార్ వేసినా, ఆఖరికి బికినీ వేసినా కూడా.. ముందు నెటిజన్లనే ఆ డ్రస్‌పై అభిప్రాయం అడుగుతుంటుంది అనసూయ. అలా ఆమె నిత్యం ఏదో ఒక న్యూ ఫొటో షూట్ షేర్ చేసి, నెటిజన్ల రియాక్షన్ చూస్తుంటుంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ సిరీస్ చిత్రాల తర్వాత అనసూయ రేంజ్ కూడా భారీగా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం అనసూయది కూడా పాన్ ఇండియా రేంజ్ అనే చెప్పుకోవాలి. అందుకే ఆమె పోస్ట్ చేసే ఫొటోలకు లక్షల్లో లైక్స్ పడుతుంటాయి.
Also Read- Naveen Chandra: నా ప్రతి సినిమాకు 10 మందైనా పెరగాలి.. అదే నా గోల్!
అయితే అనసూయకు అంత రేంజ్ ఉన్నా కూడా.. తెలుగు సినిమాలను, బుల్లితెర పోగ్రామ్స్‌ని అస్సలు మిస్ కాదు. వాటిని వదిలి ఎక్కడికి పోదు. చేతినిండా సంపాదన ఉంటే, వేరే చోటుకి వెళ్లాల్సిన అవసరం అనసూయకు ఎందుకుంటుంది? అవును కదా. అలా వెనకేసే దాదాపు ఆమె ఆస్తి రూ. 40 కోట్లకు పైనే ఉంటుందనేలా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అందులో నిజం ఎంతనేది పక్కన పెడితే, అనసూయ తాజాగా ఓ షో కి అటెండ్ అయింది. ఈ షోని యాంకర్ రవి, శ్రీముఖి (Srimukhi) హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకు అతిథిగా వచ్చిన అనసూయకు వారు ఓ ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ని అనసూయ స్వీకరించింది. అంతేకాదు, తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ షోలో అనసూయ పంచుకుంది.
Also Read- Robinhood OTT: ఓటీటీలో ‘రాబిన్‌హుడ్’ రాకింగ్..! అస్సలు ఊహించలేదు కదా!
ముందుగా ఛాలెంజ్ విషయానికి వస్తే.. ఒకవేళ మీకు పెళ్లికాకుంటే, టాలీవుడ్‌లోని ఏ హీరోతో డేటింగ్ చేసేవాళ్లు? అనే ప్రశ్నని అనసూయకు యాంకర్ రవి (Anchor Ravi) సంధించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే.. అనసూయ పచ్చి మిరపకాయ తినాల్సి వస్తుందని ఛాలెంజ్ విసిరాడు. అయితే అనసూయ అస్సలు ఆలోచించకుండా.. నా చిట్టిబాబు రామ్ చరణ్ (Global Star Ram Charan) అంటూ సమాధానమిచ్చింది. ఒక్కసారిగా అంతా క్లాప్స్‌తో హోరెత్తించారు. ఇంకా మీ భర్తలో ఉన్న నెగిటివ్ క్వాలిటీ ఏంటని అడిగితే.. షార్ట్ టెంపర్ అని బదులిచ్చింది. ఆ ఒక్కటీ లేకపోతే.. తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చింది… ఇంకా మరెన్నో విషయాలను ఆమె ఈ షో లో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, రామ్ చరణ్‌తో కలిసి రంగమ్మత్తగా ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రంలో అనసూయ నటించిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు