KTR on CM Revanth: వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కంచె గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరించాలని లేకుంటే సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కంచె గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్‌ను హెచ్చరించిన సుప్రీంకోర్టు, కంచె గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా అంటూ హెచ్చరించిందన్నారు. రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.
ఇవన్నీ ఇంటికి తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదన్నారు. రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై, కంచె గచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలని అన్నారు. కంచె గచ్చిబౌలి భూములను అమ్మి పది వేల కోట్ల రూపాయల స్కాం చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మకద్రోహమే అన్నారు.
Also Read: Fake visas Passports: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నకిలీ వీసాల గ్యాంగ్ అరెస్ట్..
సెలవుదినాల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనే అన్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంచె గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కాపాడాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన పది వేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు