KP Vivekananda on Congress( iamage credit: twitter)
Politics

KP Vivekananda on Congress: ఆరోపణలు చాలు.. హామీలపై దృష్టి పెట్టండి.. సర్కార్ పై బీఆర్ఎస్ నేత ఫైర్!

KP Vivekananda on Congress: ప్రజలనే కాదు కోర్టులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు కోర్టులు తప్పు పడుతూనే ఉన్నాయన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకిరావడమే అబద్ధాల పునాదులపై వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Also Read: Fake visas Passports: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నకిలీ వీసాల గ్యాంగ్ అరెస్ట్..

సీఎం ఫ్రస్టేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అనడంతో ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. అనాలోచితనిర్ణయాలు, అనుభవరాహిత్య నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రెండేళ్లుఅవుతున్న ఇంకా ఏం అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారన్నారు.

ఇప్పటికే గత ప్రభుత్వంపై పదికి పైగా ఎంక్వరీలు వేశారని, ఎక్కడ ఏం రుజువు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్ళీ ధరణి ఫోరెన్సిక్ అడిట్ అని మళ్ళీ ఇంకో ఎంక్వైరీ వేస్తారట అని ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆరోపణలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలని, అభివృద్ధి పనులు చేయాలని సూచించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!