Star Heroine: నటనతో పాటు డ్యాన్స్ లోనూ దుమ్మురేపే అతికొద్ది మంది హీరోయిన్స్ లో ఫరియా అబ్దుల్లా ఒకరు. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) మూవీతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. తొలి చిత్రంతోనే సాలిడ్ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా చేసిన చిత్రాలేవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో అడపాదడపా సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే తనకున్న డ్యాన్స్ టాలెంట్ తో బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాంకర్ సుమ (Anchor Suma) ఇంటర్వ్యూ చేసే ‘చాట్ షో’లో పాల్గొన్న ఫరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Also Read: MP Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ఫీజు బకాయిలపై ప్రశ్నలు.. ఆపై వార్నింగ్!
ఫరియా అబ్దుల్లా నటి కాకముందే ఆమెకు డ్యాన్స్ లో మంచి ప్రావిణ్యం ఉంది. డ్యాన్సర్ గా, ర్యాప్ సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. వెండితెరపైకి వచ్చాక ఓ సినిమాలో డ్యాన్స్ కూడా కంపోజ్ చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే సుమతో ఇంటర్వ్యూలో కొరియోగ్రఫీ గురించి ఆమెకు ప్రశ్న ఎదురైంది. స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేయాల్సి వస్తే తొలుత తను అల్లు అర్జున్ కు చేస్తానని ఫరియా అబ్దుల్లా సమాధానం ఇచ్చింది.
Also Read This: MP Bandi Sanjay: సీఎంకు బండి లేఖ.. ఫీజు బకాయిలపై ప్రశ్నలు.. ఆపై వార్నింగ్!
గతంలో ఓసారి అల్లు అర్జున్ (Allu Arjun)ను కలిసినట్లు ఫరియా తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. అప్పుడు బన్నీనే నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావ్ కదా? అని అన్నారని చెప్పింది. మీకు ఏ విధంగా తెలుసు అని అడిగితే నాకు అన్నీ తెలుస్తాయని నవ్వారని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఫ్యూచర్ లో కలిసి డ్యాన్స్ చేద్దామా? అని ఆఫర్ కూడా ఇచ్చారని ఫరియా చెప్పింది. అంతేకాదు తనకు గనుక కొరియోగ్రఫీ ఛాన్స్ వస్తే అందరి హీరోలతోనూ వర్క్ చేస్తానని ఈ అమ్మడు చెప్పింది. ప్రస్తుతం డ్యాన్స్ కంపోజ్ ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు ఆమె తెలిపింది.