Sports News Indias Dommaraju Gukesh Wins Candidates Tournament
స్పోర్ట్స్

Sports News: సరికొత్త రికార్డు సృష్టించిన భారత ఆటగాడు..

Sports News Indias Dommaraju Gukesh Wins Candidates Tournament: ప్రఖ్యాత ప్రపంచ ఛెస్ ఫెడరేషన్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన భారత ఛెస్ ప్లేయర్ గుకేష్ దొమ్మరాజు సరికొత్త హిస్టరీని సృష్టించాడు. అతి పిన్న వయస్సులో ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో ఆటగాడిగా రికార్డుని సృష్టించాడు. ఇక గతంలోనూ భారత్‌కే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనతను సాధించాడు.

ఈ గేమ్ ఫిడె క్యాండిడేట్స్ ఛెస్ టోర్నమెంట్ 2024 ఫైనల్ రౌండ్స్‌ కెనడాలోని టోరంటోలో ఏర్పాటు కాగా.. పైనల్ రౌండ్ కొనసాగింది. ఈ రౌండ్‌లో అమెరికాకు చెందిన హికారు నకమురాను భారత్‌కి చెందిన గుకేష్ నిలువరించగలిగాడు. ఈ గేమ్ డ్రాగా ముగిసింది.రష్యాకు చెందిన ఇయాన్ నెపోమ్నియాచ్చి, ఫ్యాబియానో​​కరువానా మధ్య జరిగిన మరో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. అయితే అప్పటికే గుకేష్ తొమ్మిది పాయింట్లతో ముందంజలో ఉండటంతో అతన్ని విన్నర్‌గా ప్రకటించింది ఫిడె.

Also Read: వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐదే

ఇందులో గెలవాలంటే 14 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఎవరికీ అన్ని పాయింట్లు దక్కలేదు. ఫైనల్ రౌండ్‌కు చెందిన నలుగురు ప్లేయర్లల్లో అత్యధికంగా తొమ్మిది పాయింట్లతో గుకేష్ మొదటిస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో వరల్డ్ ఛెస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఆడే ఛాన్స్‌ లభించింది. ఈ టోర్నమెంట్‌లో చైనాకు చెందిన వరల్డ్ ఛెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ డింగ్ లైరెన్‌తో తలపడనున్నాడు. గతేడాది హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడోత్సవాల్లో ఛెస్ టోర్నీలో రజత పతకం సాధించాడు గుకేష్. ఫిడె క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2024ను గెలివడంపై భారత్‌క్‌కి చెందిన పలువురు గుకేష్‌ని అభినందించారు.

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు