PG Vinda TCA Elections 2025
ఎంటర్‌టైన్మెంట్

PG Vinda: మళ్లీ పిజి విందానే.. మంచి చేస్తే అంతే!

PG Vinda: ఏదైనా మంచి చేస్తే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. మళ్లీ మళ్లీ ఆయననే గెలిపిస్తూ ఉంటారు. ఏ రంగమైనా సరే, నలుగురి మంచి కోరుకునేవారిని ప్రజలు మరిచిపోరు. అలాంటి నాయకులు ఎందరో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి నాయకుడు ఉన్నాడని అనిపించుకుంటున్నారు సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా. 2025 తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ (Telugu Cinematographers Association) ఎన్నిక‌ల్లో పి.జి. విందా మరోసారి విజయం సాధించారు. ఆదివారం జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో అసోసియేష‌న్‌లోని స‌భ్యులంద‌రూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఐక్యతను, ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇక ఈ ఎన్నికల్లో సినిమాటోగ్రఫీపై అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, ఈ రంగంలోని నిపుణుల‌ను వెలికితీస్తూ, దూర‌దృష్టితో అవిశ్రాంతంగా ప‌ని చేసిన పి.జి. విందాని స‌భ్యులు మ‌రోసారి అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో పి.జి. విందా అధ్య‌క్షుడిగా ఎన్నిక కాగా, రాహుల్ శ్రీవాత్స‌వ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా, జి. భీముడు(అలియాస్ జి. శ్రీకాంత్‌) ట్రెజ‌ర‌ర్‌గా ఎన్నిక‌య్యారు.

Also Read- Ram Pothineni: పవన్ ఫ్యాన్స్ బాటలో రామ్ పోతినేని.. పిఠాపురం సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?

ఇంతకు ముందు పి.జి. విందా అసోసియేష‌న్ అభివృద్ధి కోసం తీసుకున్న చొర‌వ‌ను, వారి త‌ప‌న‌ను గుర్తించిన స‌భ్యులు మ‌రోసారి ఆయ‌ననే తిరిగి ప్రెసిడెంట్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇది వ‌ర‌కు ఆయ‌న నాయ‌క‌త్వంలో నిర్మాణ‌ప‌రంగా త‌మ సినిమాటోగ్ర‌ాఫ‌ర్స్‌కు సంబంధించిన ప‌నులను పి.జి. విందా స‌ర‌ళీకృతం చేశారు. ఈ శాఖలో చేయాల్సిన ప‌నుల‌ను ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం, స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో పూర్తి చేసుకుంటూ వ‌చ్చారు. అవి ఆశాజనక సినిమాటోగ్రాఫర్‌లకు, అధిక పోటీ వుండే ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవడానికి, ఈ పోటీలో ఎలా ముందుకు వెళ్లాలనే విష‌యాల‌ను తెలియ‌జేసేలా పి.జి. విందా ప్యానెల్ చేసిన కార్యక్రమాలు సభ్యులకు ఎంతగానో అవగాహన కల్పించాయి.

Also Read- Samantha: ఈ ఫొటో చూస్తుంటే.. సమంత లైఫ్‌లోనూ ‘శుభం’ జరగబోతున్నట్టే ఉంది కదా!

పి.జి. విందా ఆలోచ‌న‌తో సినిమాటోగ్రాఫర్ అసోసియేష‌న్‌లో ఓ స‌హ‌కార ఇకోసిస్ట‌మ్ అనేది ఏర్ప‌డింది. దీని కార‌ణంగా యువ ప్ర‌తిభావంతులు అవకాశాల‌ను అన్వేషించుకోవ‌టానికి, త‌మ వ‌ర్క్‌లో సాంకేతికంగా ముంద‌డుగు వేయ‌టానికి వీలుక‌లిగిందని కొందరు సభ్యులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ కార‌ణంగా వారిలో ఐక్య‌త రావ‌టంతో పాటు, వారికి మంచి గుర్తింపు కూడా ద‌క్కుతుండటంతో పి.జి. విందా ప్రతి స్టెప్ సక్సెస్ అయింది. ఈ సంద‌ర్భంగా మరోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి. విందా మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో అధ్యకుడిగా మరోసారి నన్ను ఎన్నుకున్నందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. స‌భ్యులంద‌రూ ఉత్సాహంగా ఇక్క‌డ‌కు వ‌చ్చి ఎన్నిక‌లలో పాల్గొని మా ప్యానెల్‌కు విజ‌యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కేవ‌లం కొంద‌రి గెలుపు మాత్రం కాదు, అసోసియేష‌న్‌లో ఉన్న స‌భ్యులందరి విజ‌యం. ఇదే ఉత్సాహంతో తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్‌ను మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసుకెళ్ల‌టానికి మనమందరం స‌మిష్టిగా ముంద‌డుగు వేద్దామని పిలుపు నిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు