Samantha: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత పేరు ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు సమంత, చైతూ (Naga Chaitanya)ల విడాకులకు కారణం ఏమిటనేది మాత్రం వారి నోటి వెంట రాలేదు. వాళ్ల ఫ్యామిలీలు కూడా చెప్పలేదు. అప్పుడప్పుడు సమంత కొన్ని హింట్స్ ఇస్తుంటే, అవే రీజన్ అని అంతా రాసుకోవడం తప్పితే, అసలు విషయం మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ఇక నాగ చైతన్య రెండో పెళ్లి (Second Marriage) చేసుకున్న తర్వాత సమంతపై బాగా ప్రెజర్ ఎక్కువైనట్లుగా అయితే అర్థమవుతోంది. చైతూకి ధీటుగా తను కూడా మ్యారేజ్ చేసుకుని చూపించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా, ఆమె చేస్తున్న కొన్ని పనులు అనిపిస్తున్నాయి.
Also Read- Adhire Abhi: ప్రభాస్‌ని ‘అరేయ్’ అంటోన్న అదిరే అభి! అసలు విషయమిదే!
ప్రస్తుతం నటిగా ఎంతకాలం ఉంటానో తెలియదు, అందుకే నిర్మాతగా మారానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చింది. ఆమె చెప్పినట్టే, మొదటి అటెంప్ట్‌లోనే సక్సెస్‌ని అందుకుని, ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది. నటిగానూ టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్న సమంత, నిర్మాతగా నెక్స్ట్ స్టెప్ వేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆమె సినిమాల కంటే కూడా, పర్సనల్ లైఫ్ విషయంలోనే ఎక్కువగా వార్తలలో ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోతో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపింది. అవును, కొన్ని రోజులుగా సమంత రెండో పెళ్లికి సంబంధించి ఏ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయో తెలియంది కాదు. ఆ వార్తల్లోని పర్సన్‌తోనే మరోసారి సమంత చాలా క్లోజ్‌గా కనిపించి, తన జీవితంలోకి రాబోయే పర్సన్ తనే అనేలా మరోసారి హింట్ ఇచ్చేసింది.
Also Read- Kingdom: నిర్మాత నోటి దూల.. విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వాయిదా!
ఆ పర్సన్ వేరే ఎవరో కాదు.. సమంతతో ‘ది ఫ్యామిలీమ్యాన్’, ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వంటి సిరీస్‌లను రూపొందించిన దర్శకద్వయం రాజ్ డీకేలో రాజ్. ఆ వెబ్ సిరీస్‌లు చేస్తున్నప్పటి నుంచి రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అప్పుడంతగా వీరి బంధం హైలెట్ కాలేదు కానీ, ఈ మధ్య మాత్రం ఇద్దరూ ఎక్కువగా కనిపిస్తుండటంతో.. ఇద్దరి మధ్య మ్యాటర్ నిజమే అనేలా టాక్ వినబడుతూనే ఉంది. అయితే సమంత మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా ఇప్పుడామె పోస్ట్ చేసిన ఫొటోని చూసిన తర్వాత, ఈ మధ్య సమంత నిర్మించిన ‘శుభం’ (Subham) టైటిల్‌లా.. తన లైఫ్‌లోనూ ఏదో ‘శుభం’ జరిగే అవకాశాలైతే లేకపోలేదు అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మొత్తంగా అయితే, ఈ పిక్‌తో సమంత మరోసారి నెట్టింట చర్చలకు తావిచ్చిందనేది మాత్రం.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈజీగా తెలిసిపోతుంది. మరి ఆమె లైఫ్‌లో ఏం జరగబోతుందో.. వెయిట్ అండ్ సీ.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు