Sabitha Indra Reddy: ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Also read: Miss World Contestants: కట్టు బొట్టుతో ఆకట్టుకున్న అందాల భామలు
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇవాళ ఆ హామీలను పూర్తిగా విస్మరించి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు.
ఇప్పటికీ ప్రజల్లో వెళ్లే ధైర్యంలేక లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తోందన్నారు. దమ్ముంటే వెంటనే ఎన్నికలు పెట్టాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మండిపడ్డారు.