Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇప్పుడు అవకాశాలు తక్కువ అయ్యాయి. అయితే, ప్రస్తుతం తమన్నా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. తమన్నా భాటియా రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ.. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. అయితే, ఇది నిజమేనా.. ఫేకా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
కొన్ని రోజులు బాలీవుడ్ హీరో విజయ్ వర్మ తో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ అతనికి బ్రేకప్ చెప్పి, సింగిల్ గానే ఉంటుంది. అప్పటి నుంచి ఈమె ఏ చిన్న వార్త వచ్చిన ట్రోలర్స్ తెగ వాడేస్తున్నారు.
Also Read: Aamir Khan Film: చిక్కుల్లో అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ చిత్రం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్
తమన్నా భాటియా.. తెలుగు నుంచి హిందీ వరకు సినిమాలు చేస్తుంది. అంతే కాదు, ఐటెమ్ సాంగ్స్ లో కనిపిస్తూ ఈ అమ్మడు క్రేజ్ పెంచుకుంది. తమన్నా తాజాగా పెళ్లి వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నట్టు నెట్టింట ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, పెళ్లికొడుకు ఎవరా అన్నది మాత్రం బయటకు రాలేదు. ఆమె పెళ్లి డ్రెస్ లుక్ లో కనిపించిన ఫోటో వైరల్ కావడంతో ఏంటి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా అంటూ అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: Monalisa: గుడ్ న్యూస్.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న కుంభమేళ మోనాలిసా
అయితే ఈ ఫోటోను చూసి కొందరు విజయ్ వర్మకి గట్టి షాక్ ఇచ్చావ్ గా అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.వాస్తవానికి ఈ ఫొటోస్ ని క్లారిటీగా చూస్తే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది, ఆమె తమన్నా కాదు అని. కావాలనే కొందరు ఫేక్ పెళ్లి ఫోటోలు క్రియోట్ చేసి తమన్నా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందంటూ ప్రచారం చేస్తున్నారంటూ కొట్టి పారేస్తున్నారు.