Uttam kumar reddy: ధాన్యం కొనుగోలు అంశంలో అబద్ధాలు మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. ప్రతిరోజు అబద్దాలను ప్రచారం చేస్తూ అవే నిజాలుగా ప్రజలను భ్రమింపచేసే ప్రయత్నం మానుకోవాలని ఉద్బోధించారు. ఎక్స్ వేదికగా మంగళవారం హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్టు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను ధాన్యం కొనుగోలు విషయంలో హరీష్ రావు తప్పు దోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం నిరుపయోగంగా మారిన ఖరీఫ్, రబి సీజన్లను కలిపి ధాన్యం దిగుబడి 281లక్షల మెట్రిక్ టన్నులన్నారు. యాసంగిలో ఇప్పటికే 65 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని కిందటేడాది కంటే 44 శాతం అధికమన్నారు. గడిచిన రెండేళ్ల యాసంగి సీజన్ తో పోల్చి చూస్తే 120 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగాయని వివరించారు. యాసంగి సీజన్ లోనూ ధాన్యం దిగుబడి లో తెలంగాణ రికార్డు సాదించిందని పేర్కొన్నారు.
Also Read: Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాల కోసం.. రూ.8 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాలు సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని, ప్రస్తుత యాసంగి సీజన్ లో 55 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నామన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవదిలోనే ఖరీఫ్, రబీ సీజన్ లు కలిపి దిగుబడి అయ్యో మొత్తం కలిపి 280 లక్షల మెట్రిక్ టన్నులన్నారు. 2023-24 యాసంగి తో పోల్చితే ఈ యాసంగిలో ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు కొనుగోలు చేసింది 23.48 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉన్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు 8,245 అని, గతేడాది కంటే అదనంగా 1,067 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.58 లక్షల మంది రైతుల నుండి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 27. 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం దొడ్డు రకాలని,15.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాం సన్నాలు ఉన్నట్లు తెలిపారు.
Alaso Read: Mahabubabad district: రైతులకు 21 వేల కోట్లతో రుణమాఫీ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు!
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం విలువ 9,999.36 కోట్లు అని ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు చెల్లించిన మొత్తం 6,671 కోట్లు అని ఆయన తెలిపారు.ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలలో నగదును జమ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నాలకు అందించాల్సిన బోనస్ మొత్తం 767 కోట్లు అని వెల్లడించారు. హరీష్ రావు చేసిన ప్రకటన ప్రజలను తప్పు దోవ పట్టించే విదంగా ఉందని మండిపడ్డారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు