Dayakar On Eatala: ఈటల రాజేందర్ నకిలీ బీసీ అని టీ పీసీసీ స్పోక్స్ పర్సన్ దయాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈటల రాజేందర్ ఓట్ల కోసం మాత్రమే బీసీ కార్డును వాడుతున్నారన్నారు.
కేసీఆర్ ను రక్షించేందుకు ఆయన బీజేపీ లోకి వెళ్లారని వివరించారు. బీజేపీలో అధ్యక్ష పదవి రాలేదన్న మానసిక క్షోభతో ఈటల నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం హైడ్రాను విమర్శిస్తున్నారన్నారు.
Also read: Maoists killed: ఆపరేషన్ కగార్ టర్నింగ్ పాయింట్.. మావోయిస్టులకు భారీ దెబ్బ!
మూసీ ప్రక్షాళనతో మేలు చేస్తుంటే, ప్రభుత్వం చేసే మంచిని అడ్డుకునేందుకు ఈటల ధర్నా చేయడం విచిత్రంగా ఉన్నదన్నారు. బీసీ కుల గణన చేస్తే కనీసం స్వాగతించలేదన్నారు. ఈటల ఇంట్లొ పిల్లి..బయట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి ఈటలకు కనిపించకపోవడం దారుణమన్నారు.