Govindappa Balaji Arrest
ఆంధ్రప్రదేశ్

AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో గోవిందప్ప అరెస్ట్.. వైసీపీలో టెన్షన్

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు పెను సంచలనమే సృష్టిస్తోంది. ఇందులో రెండ్రోజులకోసారి కీలక పరిణామమే చోటు చేసుకుంటున్నది. కొందరు పెద్ద తలకాయలకు నోటీసులు, మరికొందరు అరెస్ట్ అవుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని (Govindappa Balaji) సిట్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కర్ణాటకలోని మైసూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అక్కడి కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డికి అత్యంత ఆప్తుడు కూడా. మరోవైపు సుప్రీం కోర్టులో కూడా గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌కు దాఖలు చేయగా, ధర్మాసనం నిరాకరించింది. వాస్తవానికి ఈ కుంభకోణం కేసులో కీలక నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలతో పాటు బాలాజీ గోవిందప్పలకు మూడు రోజుల క్రితమే సిట్ పోలీసులు నోటీసులిచ్చారు. విచారణకు హాజరు కావాలని చెప్పినా రాలేదు. ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను నిరాకరించాయి. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీల మధ్య తీవ్ర విమర్శలు, అంతకుమించి ఆరోపణలు సాగుతున్నాయి. మరోవైపు గోవిందప్ప అరెస్ట్‌తో వైసీపీలో ఒకింత టెన్షన్ మొదలైందనే ప్రచారం ఊపందుకున్నది.

Read Also- Kodali Nani: కొడాలి నాని బాగోతం బట్టబయలు.. రాజకీయాలకు వైసీపీ కీలక నేత గుడ్ బై

ముడుపుల లెక్కలు..
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతినెలా వసూలు చేసిన రూ.60 కోట్ల ముడుపుల సొమ్మును రాజ్‌ కసిరెడ్డి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్న గోవిందప్ప బాలాజీకి అందించేవాడని సిట్ విచారణలో తేలింది. దీంతో బాలాజీని ఏ-33గా చేర్చి విచారణకు రమ్మంది సిట్. రాకపోవడంతో మైసూరులో ఉన్న బాలాజీని అరెస్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతినెలా వసూలు చేసిన రూ.50-60 కోట్ల ముడుపుల సొమ్మును రాజ్‌ కసిరెడ్డి ఇద్దరికి ఇచ్చేవాడు. వారిలో ఒకరు అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఇంకొకరు భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్న గోవిందప్ప బాలాజీ అని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కోసం సిట్ గాలింపు కొనసాగుతోన్నది.

TDP Vs YSRCP

ఎందుకీ హడావుడి..
వైఎస్ జగన్ హయాంలో ఎలాంటి లిక్కర్ స్కాం జరగకపోయినా.. ఏదో జరిగిపోయింది అంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తోంది. ప్రభుత్వమే స్వయంగా మద్యం అమ్మి.. ఖజానాకి ఆదాయం పెంచితే ఇందులో స్కాం ఎలా జరుగుతుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కాదా కమీషన్స్, స్కాంలు జరిగేది? ఊరు పేరు లేని బ్రాండ్‌లు తీసుకొచ్చి.. మద్యం స్కాంలకి తెరతీసిందే చంద్రబాబు అని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాగా, మొదట్నుంచీ రాష్ట్రంలో లిక్కర్ స్కాం జరగనే లేదని వైసీపీ చెబుతూ వస్తున్నది. ఇటు వైసీపీ స్కామ్ లేదని, అటు టీడీపీ మాత్రం స్కామ్ జరిగిందని చెబుతుండటంతో ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం అని తెలియని పరిస్థితి.

MP Mithun Reddy
మిథున్ రెడ్డికి ఊరట..

కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన మద్యం విధానం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీ సీఐడీకి హితవు పలుకుతూ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని.. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలని కూడా చెప్పింది. ఈ కేసులో పిటీషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదని.. అరెస్ట్‌కు సహేతుక కారణాలు చూపించాలని కోర్టు చెప్పింది. అందుకే మెకానికల్ అరెస్టులు సరికాదని, కేసు పెట్టిన వెంటనే అరెస్టు చేయాలని యోచన సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేకాకుండా పార్లమెంట్ సభ్యుడి పరువు ప్రతిష్టలను పరిగణలోకి తీసుకోవాలని.. తాజాగా మరోసారి పిటిషన్ హైకోర్టు విచారణ చేయాలని కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలని, హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read Also- YS Jagan: ఫస్ట్ టైమ్ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ పొగడ్తలు..

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!