YS Jagan: టైటిల్.. చూడగానే అవునా.. నిజామా? అనిపిస్తోంది కదూ..? అవునండోయ్ మీరు వింటున్నది అక్షరాలా నిజమే. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రతిసారీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. (YS Jagan Mohan Reddy) ఫస్ట్ టైమ్ పొగడ్తలు కురిపించారు. అంతేకాదు ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇంకా నమ్మశక్యం కాలేదు కదా.. ఇంకెందుకు ఆలస్యం ఈ వార్త చకచకా చదివేస్తే అసలు సంగతేంటో మీకే అర్థమైపోతుంది..
మురళీ త్యాగానికి వెల కట్టలేం..
‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో వీర మరణం చెందిన జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ (Jawan Murali Naik) కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చేరుకున్న జగన్..అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌లను పరామర్శించారు. జగన్‌ను చూసిన ఆ వీర జవాన్ తల్లిదండ్రులు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన, వైసీపీ, ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. దేశం కోసం ప్రాణలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమన్నారు. ఆ కుటుంబానికి పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరపు నుంచి ఆ కుటుంబానికి అండగా, తోడుగా ఉంటామని జగన్ మాటిచ్చారు.
కృతజ్ఞతలు..
‘ మురళీనాయక్ చిన్నవాడైనా తన మరణంతో రాష్ట్రంలో చాలా మందికి, పెద్దలకు స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు. దేశం కోసం పోరాడుతూ తన ప్రాణ త్యాగంతో అనేక మంది అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలిచారు. దేశం కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని వెనక్కు తీసుకొని రాలేం కానీ, అతడు చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలంతా రుణపడి ఉంటారు. దేశం కోసం పోరాడుతూ, ప్రాణాలు కోల్పోతే రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని కొనసాగిస్తూ, ఈ ప్రభుత్వం (చంద్రబాబు సర్కార్) కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు. ఈ కుటుంబానికి మంచి జరగాలి. చనిపోయిన మురళీ ఆత్మకు శాంతి కలగాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. హమ్మయ్యా.. ఇన్నాళ్లకు జగన్ జరిగిన విషయాన్ని జరిగినట్లుగా చెప్పారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇక టీడీపీ శ్రేణులు అయితే ‘ఫస్ట్ టైమ్ జగన్ నోట ప్రభుత్వంపై పొగడ్తలు’ అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా, వైసీపీ హయాంలో దేశ సరిహద్దుల్లో అమరులైన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Also- Kodali Nani: కొడాలి నాని బాగోతం బట్టబయలు.. రాజకీయాలకు వైసీపీ కీలక నేత గుడ్ బై