Maharashtra Tiger Attack: వేర్వేరు చోట్ల పులులు దాడి చేయడంతో నలుగురు మహిళలు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ లో చోటుచేసుకుంది. సిందెవాహి తాలూకా మేండమాల గ్రామానికి చెందిన కొంతమంది తునికాకు సేకరణ కోసం సోమవారం ఉదయం సమీప చార్ గావ్ అటవీక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు.
సాయంత్ర మైనా కాంత చౌదరి, శుభాంగీ చౌదరి, రేఖ షిండే లు ఇళ్ళకు తిరిగి రాకపోవడంతో. కుటుంబీకులు గ్రామస్థులతో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లి వెతికారు. అలా అడవిలో కొన్నిచోట్ల వెతకగా ఓ చెరువు వద్ద ముగ్గురి మృతదేహాలు కనిపెంచగా అటవీ అధికారులకు సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకున్న ఎఫ్ ఆర్ ఓ విశాల్ సాల్ కార్ ఆధ్వర్యంలో బృందం ఘటనా స్థలానికి చేరుకొని పులి దాడి చేయడంతోనే మహిళలు మృతి చెందారని నిర్ధారించారు.
Also read: Kodali Nani: కొడాలి నాని బాగోతం బట్టబయలు.. రాజకీయాలకు వైసీపీ కీలక నేత గుడ్ బై
ఇదిలా ఉండగా.. మూల్ తాలూకా నాగాడా గ్రామంలో మరో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విమల షిండే సోమవారం ఉదయం తునికాకు సేకరించేందుకు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి స్థానికులతో కలిసి వెళ్లింది.
హఠాత్తుగా ఆమె పై పులిదాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అక్కడే ఉన్న స్థానికులు భయబ్రాంతులకు గురై కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది.
మొత్తానికి ఒకే రోజు పులి దాడిలో నలుగురు మృత్యువాత పడడంతో స్థానిక ప్రజలు భయాందోళనతో ఉన్నారు.