Kodali Nani: అవును.. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై (Kodali Nani) సొంత పార్టీ కీలక నేత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన తీరు నచ్చక ఆఖరికి రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. నానీని నమ్మి నిలువునా మోసం పోయానని, ఇంత జరిగిన తర్వాత ఇక రాజకీయాల్లో కొనసాగలేనని.. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించేశారు. అంతలా ఆ నేత ఎందుకు విసిగిపోయారు..? కొడాలిపై ఎందుకింత అసహనం, ఆగ్రహం? సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also- Ashok Bendalam: ‘ఎందుకంత కొవ్వు’ అని రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
నమ్మి మోసపోయాం..
గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైసీపీ (YSR Congress) కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసీం (అబూ) మాజీ మంత్రి కొడాలి నానిపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. నానీని నమ్మి మోసపోయామని, కనీసం వరద బాధితులను కూడా పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చారు. రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ‘ ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణులను నాని గాలికి వదిలేశారు. వైసీపీలో ఉన్నప్పటికీ మా కష్టాలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. వరదల్లో నందివాడ మండలం మునిగిపోయింది. ప్రజలు కష్టపడుతున్న కొడాలి నాని కన్నెత్తి చూడలేదు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రాము, ఆయన అనుచరులు.. వరద బాధితులకు అండగా నిలిచారు. రాజకీయాలకే కొత్త అర్థం చెప్పేలా.. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వెనిగండ్ల రాము సేవ చేస్తున్నారు. ఎన్నికలు అనంతరం రాము అమెరికా పారిపోతారంటే మేమంతా నమ్మాం. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నాను. మమ్మల్ని తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో కూడా తెలియడం లేదు. ఇక రాజకీయాలకు జోలికి నేను రాను.. పూర్తిగా దూరంగా ఉంటాను’ అని అబూ సంచలన వీడియోను రిలీజ్ చేశారు.
Read Also- Nara Lokesh: చినబాబూ.. గెలిచాక యువనేతలను పట్టించుకోరేం.. ఇంత అన్యాయమా?
నాని ఎక్కడున్నారు?
కాగా, కొడాలి నానికి ఈ మధ్యనే బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏప్రిల్- 02న నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఏషియన్ హార్ట్‌కేర్ ఆస్పత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే సుమారు 8 నుంచి 10 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు.. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో నాని ఉన్నారు. మరో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉండాలని వైద్యుల సూచన మేరకు అక్కడే ఉన్నారు. ఆయన కోలుకున్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి రావడంతో.. ముంబైలో ఉన్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గానే ఉన్నారు. తన ఆప్త మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత బయటికొచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తొలుత హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న ఆయన.. ప్రస్తుతం హైదరాబాద్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో పార్టీని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఈక్రమంలోనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. నాని అభిమానులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అబూ వ్యవహారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.
Read Also- Indian Army: వణికిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ ఫైనల్ వార్నింగ్