Bendalam Ashok Overaction
ఆంధ్రప్రదేశ్

Ashok Bendalam: ‘ఎందుకంత కొవ్వు’ అని రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

Ashok Bendalam: ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్.. నలుగురిలో బలుపు మాటలు మాట్లాడి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది కూడా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై రెచ్చిపోవడంతో ఓహో.. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా?, మంచి ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్‌పై మంచిగా వార్నింగ్ అంటూ నెటిజన్లు చిత్రవిచిత్రాలుగా కామెంట్లు, అంతకుమించి సెటైర్లు కురిపిస్తున్నారు. సారు ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? అసలేం జరిగింది? ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేశారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం…

ఎందుకంత కొవ్వు?
జాతీయ గ్రామీణ‌ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై బెందాళం అశోక్ నోరు పారేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ ‘ వాడికి ఎందుకంత కొవ్వు.. వాడు అంత డార్కాడిగాడా? నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు’ అంటూ ఎమ్మెల్యే నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. పూర్తి వివరాల్లోకెళితే.. గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవి కుమార్‌పై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మెండుగానే ఉన్నాయి. టీడీపీ నేత‌లంతా కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ రవి కుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామ‌స్తులంతా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేశారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని, అతడిని తొలగించొద్దని, మంచివాడని.. ఎమ్మెల్యేను గ్రామస్తులు వేడుకున్నారు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే… వాడిని ఏం చేయాలో నాకు తెలుసు.. మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు, మహిళలతో దురుసుగా మాట్లాడారు.

Read Also- Nara Lokesh: చినబాబూ.. గెలిచాక యువనేతలను పట్టించుకోరేం.. ఇంత అన్యాయమా?

మీరెందుకు రొడ్డెక్కారు?
ఫీల్డ్ అసిస్టెంట్ సంగ‌తి నాకు చెబుతారా? ఫీల్డ్‌లో ఏం జ‌రుగుతుందో నాకు తెలియ‌దని అనుకుంటున్నారా? వాడి కోసం మీరెందుకు రోడ్డెక్కుతారు? ఎవ‌డో త‌ప్పు చేశాడ‌ని మీరెందుకు స‌ఫ‌ర్ కావాలి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. అంత‌వ‌ర‌కు నేను గ్యారంటీ. మిగిలిన ఇష్యూస్ గురించి మీరెవ్వరూ ఎంట‌ర్ కావొద్దు. అఫిషీయ‌ల్‌గా జ‌రుగుతున్న ప‌నులు ఇవి. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ ప‌రిధిలో ఉండాలో ఆ ప‌రిధిలోనే ఉండాలి.. గీత దాటకూడదు. ఈ రోజు వాడు ఇంత మంది ఆడ‌వాళ్లను ఇక్కడికి పంపించాడంటే.. వాడి రాజ‌కీయం ఏందో అర్థం చేసుకోండి. వాడికి అంత కొవ్వూ.. అలాంట‌ప్పుడు వాడు నేరుగా నా దగ్గరికే రావాలి. వాడు వ‌చ్చి ఏం జ‌రిగింద‌ని న‌న్ను అడ‌గాలి. వాడు రాకుండా మీతో డ్రామాలాడిస్తాడా? వాడికెందుకు అంత కొవ్వు.. వాడేం అంత డార్కాడిగాడా? వాడు బాగా ప‌నిచేసి ఉంటే 28 కంప్లెంట్స్ ఎందుకు వ‌చ్చాయి? అధికారికంగా రాసి రిజిస్ట్రర్డ్ చేసి విచార‌ణ చేసిన కంప్లెంట్స్ ఇవి. వాడంటే మీ అందరికీ ఇష్టం ఉండ‌వ‌చ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధ‌న‌లు అనేవి ఉంటాయి క‌దా? మీరంతా ఈ స‌బ్జెక్ట్‌ను వ‌దిలేయండి. వాడిని పిలిపించి నేను మాట్లాడుతా అంటూ ఎమ్మెల్యే త‌న వ‌ద్దకు వ‌చ్చిన గ్రామ‌స్తుల‌ను ఒకింత బెదిరించి పంపించారు.

Read Also- Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. జనసేనకు ఇంతేనా..?

ఆ మాత్రం తెలియదా?
ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్‌గా మారింది. దీంతో కొంచెం కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం? అంటే అని నెటిజన్లు, సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా కాలం.. నలుగురిలో మాట్లాడేటప్పుడు, నాలుగు గోడల మధ్య మాట్లాడేటప్పుడు చాలా తేడా ఉంటుందని విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే.. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయ్.. అలా కెమెరా ఆన్ చేసేస్తే వీడియో రికార్డ్ అయిపోతోంది.. ఇలా నిమిషాల్లోనే సోషల్ మీడియాలో పోస్టు చేసేస్తున్నారు. ఇక ఇదే అదునుగా కొందరు నెటిజన్లు, అంతకుమించి వైసీపీ సోషల్ మీడియా వేయి కళ్లతో ఎదురుచూపుల్లో ఉన్నారనే తెలుసుకుంటే మంచిది మరి. ఈ విషయం ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Read Also- Kesineni Nani: టీడీపీ ఎంపీపై ఈడీకి నాని లేఖ.. చిన్నీ పనైపోయినట్టేనా?

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!