AP Nominated Posts
ఆంధ్రప్రదేశ్

Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. జనసేనకు ఇంతేనా..?

Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో మాజీ మంత్రులు, టికెట్ ఆశించి భంగపోయిన తెలుగు తమ్ముళ్లను ఎట్టకేలకు పదవులు వరించాయి. మొత్తం 22 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా.. ఇందులో జనసేనకు కేవలం మూడంటే మూడే పదవులు దక్కాయి. ఇక బీజేపీకి అయితే ఒక్కటే దక్కింది. దీంతో ప్రతిసారీ జనసేన, బీజేపీ అంటే చిన్న చూపేనా? అంటూ ఆయా పార్టీల శ్రేణులు, నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏ పదవి ఎవరికి ఇచ్చారు? ఏయే ప్రాంతాల వారికి ఎక్కువ పదవులు ఇచ్చారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పదవుల భర్తీ ఇలా..
1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు : డా. జెడ్. శివ ప్రసాద్ (నెల్లూరు సిటీ, టీడీపీ)
2. ఆంధ్రప్రదేశ్ విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) : ఎస్. రాజశేఖర్ ( కుప్పం, టీడీపీ)
3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ : సుగుణమ్మ (తిరుపతి, టీడీపీ)
4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు : వెంకట శివుడు యాదవ్ (గుంతకల్, టీడీపీ)
5. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు : వలవల బాబ్జీ (తాడేపల్లిగూడెం, టీడీపీ)
6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) : బురుగుపల్లి శేషారావు (నిడదవోలు, టీడీపీ)
7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ : పీతల సుజాత (భీమవరం, టీడీపీ)
8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ : దివాకర్ రెడ్డి (తిరుపతి, టీడీపీ)
9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) : వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన (ఏలూరు, టీడీపీ)
10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) : డా. రవి వేమూరు (తెనాలి, టీడీపీ)
11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ : మలేపాటి సుబ్బా నాయుడు (కావలి, టీడీపీ)
12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ : కె.ఎస్. జవహర్ (కొవ్వూరు, టీడీపీ)
13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య : పెదిరాజు కొల్లు (నరసాపురం, టీడీపీ)
14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ : పేరేపి ఈశ్వర్ (విజయవాడ ఈస్ట్, టీడీపీ)
15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ : మల్లెల ఈశ్వరరావు (గుంటూరు వెస్ట్, టీడీపీ)
16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య : ఆకాసపు స్వామి (తాడేపల్లిగూడెం, టీడీపీ)
17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) : లీలకృష్ణ (మండపేట, జనసేన)
18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ : రియాజ్ (ఒంగోలు, జనసేన)
19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ : డా. పసుపులేటి హరి ప్రసాద్ (తిరుపతి, జనసేన)
20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ : సోల్ల బోజ్జి రెడ్డి (రంపచోడవరం, బీజేపీ)
21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ : డా. రాయపాటి శైలజా (అమరావతి జేఏసీ)
22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ : ఆలపాటి సురేష్ (అమరావతి జేఏసీ)

TDP And Janasena

సొంత జిల్లాకే ఎక్కువ!
మొత్తానికి చూస్తే.. ఈ నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లకే ఎక్కువ పదవులు వరించాయి. మరోవైపు ఉభయ గోదావరి, రాయలసీమ నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఆశించి రాని నేతలు సైతం ఉన్నారు. సుగుణమ్మ తిరుపతి టికెట్ ఆశించగా జనసేన ఖాతాలోకి పోయింది. దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పదవి దక్కింది. మరోవైపు పీతల సుజాత కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కానీ రాలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ పదవిని సీఎం చంద్రబాబు కట్టబెట్టారు. ఇక మాజీ మంత్రి, సీనియర్ నేత కె.ఎస్ జవహర్‌.. కొవ్వూరు టికెట్ ఇవ్వాలని కోరగా దక్కలేదు. దీంతో కాస్త ఆలస్యమైనా రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పదవి జవహర్‌ను వరించింది. ఇలా చెప్పుకుంటూ ఈ 22 మందిలో చాలా మందే ఉన్నారు. ఇక జనసేన తరఫున ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ముఖ్యంగా ఒంగోలులో కీలకంగా ఉన్న రియాజ్‌కు ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ పదవిని జనసేన కట్టబెట్టింది. మరోవైపు ఈసారైనా జనసేనలో ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు