Farmers concern: మల్టీ నేషనల్ బహుళ జాతి మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ (మేల్, ఫిమేల్) విత్తనాలతో సేద్యం చేసిన రైతులకు నష్టపరిహారం అందకుండా సింజంట, హైటెక్, బేయర్, సిపి, పెన్నా కావేరి లతోపాటు మరికొన్ని కంపెనీల ఆర్గనైజర్లు అడ్డుకుంటున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల రైతులు, ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర బాధ్యులు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమంలో భాగంగా బహుళ జాతి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి మాట్లాడుతూ… గత వారం రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను సందర్శించినప్పుడు రెండు రోజుల్లో రైతులకు రూ.15 కోట్ల అందిస్తామని చెప్పిన కలెక్టర్ ను రాజకీయ ఒత్తిళ్లు అని అణచి వేశాయని తెలిపారు. మల్టి నేషనల్ కంపెనీల ఆర్గనైజర్లు జిల్లా కలెక్టర్ ను తప్పుదారి పట్టించి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్లుగా చేయాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
Alos Read: Mulugu Farmer: మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ విత్తనాలతో నష్టపోయిన రైతులు.. పట్టించుకోని అధికారులు!
ఏ బి సి గ్రేడ్లతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఏ గ్రేడ్ లోనే నష్టపరిహారం అందించేందుకు అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఆర్గనైజర్లపై అధికారులు తూతూ మంత్రంగా మనీ లాండరింగ్ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆర్గనైజర్లపై పటిష్టమైన కేసులు పెట్టి జైలుకు పంపితే రైతులకు సరైన న్యాయం జరిగేదని వెల్లడించారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ద్వారానే రైతులకు సంపూర్ణ నష్టపరిహారం అందిస్తారని పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Also Read: Mega Health Camp: పేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం.. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి!
గత 70 రోజుల నుంచి రైతులు పరిహారం కోసం ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోవడం దారుణం అన్నారు. పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబాలకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయంగా పరిహారం చెల్లించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షకు సిద్ధమవుతామని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని లోని హైదరాబాద్ గాంధీ భవన్ ను ముట్టడిస్తామని చెప్పారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు