Laxman On Amit Shah: హోమ్ మంత్రి అమిత్ షా మావోయిస్టు పార్టీకి డెడ్ లైన్ పెట్టడం రాజ్యంగా విరుద్ధం, మావోయిస్టుల బలం తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం అనడం సరికాదు. ఒక్కసారి మావోయిస్టులకు బహిరంగ సభ పెట్టుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళ బలం తగ్గిందో పెరిగిందో తెలుస్తుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో పౌరహక్కుల సంఘము ఉమ్మడి వరంగల్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ బలం తగ్గింది అంటున్న కేంద్రం మావోయిస్టులకు ఒక బహిరంగ సభ పెట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు రావడం అంటే ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలను చూడలేక మాత్రమే అన్నారు. ఆదివాసీ ఐక్యవేదిక పేరుతో గ్రామాల్లో ఆదివాసీలపై జరుగుతున్న దారుణాలను ప్రజల్లోకి పౌరహక్కుల నేతలు తీసుకెల్లాలని కోరారు.
Also Read: MLA Harish Rao: ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలి.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
పోరాడి సాధించుకున్న హక్కుల్ని ప్రభుత్వాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి. ఆదివాసీ హక్కుల కోసం ప్రతి ఒక్కరు పోరాటానికి సిద్ధం కావాలి. సహజ వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసమే అడవుల్లో కేంద్ర బలగాల మోహరింపు సరికాదని లక్ష్మణ్ అన్నారు.