Rahul Gandhi news today
Politics

PM Modi: మోడీ పాలనలో రైలు వ్యవస్థ ఎవరికి చేరువైంది?

Rahul Gandhi: ప్రజా రవాణా ప్రభుత్వ బాధ్యత. ఇది సేవారంగానికి సంబంధించిన అంశం. సేవా రంగంలో లాభాపేక్ష కూడదు. రవాణాలో ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉన్నది. ప్రజలు ఏదైనా ఎంచుకునే హక్కు కలిగి ఉన్నారు. దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా ఎక్కువ. కాబట్టి, సాధారణంగానే వారు ప్రభుత్వ రవాణా వ్యవస్థనే ఎంచుకుంటారు. వీలైతే చౌకగా లభించే రైలు వ్యవస్తను దూర ప్రయాణాలకు ఎంచుకుంటారు. అసలు రైలు వ్యవస్థ పేద ప్రజలకు పెన్నిది వంటిది. దేశంలో స్వాతంత్ర్యం రావడానికి ముందు నుంచే రైల్వే వ్యవస్థ ఉనికిలో ఉన్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు మెట్రో ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి. భారత్ కూడా వాటిని స్వీకరిస్తున్నది. ఈ క్రమంలో పేదల పట్టుగొమ్మ అయిన రైల్వే వ్యవస్థను బ్యాలెన్స్‌డ్‌గా నడుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే కొంత సంతులనం దెబ్బతిన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీన్నే ఇప్పుడు ప్రశ్నిస్తున్నది.

వాస్తవానికి మోడీ ప్రభుత్వంలో వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి వచ్చాయి. పలు రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇవి టైమ్ సేవ్ చేసుకోవడానికి, సుఖవంతంగా ప్రయాణించడానికి దోహదపడుతున్నాయనడంలో సందేహం లేదు. కానీ, ఇవి ఇది వరకు రైల్వే వ్యవస్థపై ఆధారపడిన పేదలకు ఏ స్థాయిలో ఉపయుక్తం అవుతున్నాయనేదే ప్రశ్న. రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా లేవనెత్తారు.

ఒక వైపు సంపన్నులు లేదా.. కొంత డబ్బు వెచ్చించుకోగల వర్గం ఈ కొత్త ట్రైన్లను సంతృప్తికరంగా వాడుకుంటున్నాయి. ఇన్ టైమ్‌లో చేరాలనే పరిమితులు లేని లేదా.. డబ్బులు ఎక్కువగా ఖర్చుపెట్టలేని వర్గం ఈ కొత్త ట్రైన్లను ఏ మేరకు వినియోగించుకుంటున్నాయి. ఈ కొత్త ట్రైన్ల వైపు అందరి దృష్టి మరల్చి ఇది వరకు ఉన్న సాధారణ ట్రైన్లపై దృష్టి తగ్గిస్తే.. ఆ సాధారణ ట్రైన్లపై పర్యవేక్షణ కొరవడితే అది కచ్చితంగా సామాన్యులకు, పేద ప్రజలకు ఇబ్బందికరంగానే మారుతుంది.

Also Read: ‘పవర్ కోసం వచ్చిన లీడర్ మోడీ.. ప్రజల కోసం పోరాడే ఫైటర్ రాహుల్’

అందుకే నరేంద్ర మోడీ పాలనలో సామాన్యులకు రైలు ప్రయాణం శిక్షగా మారిందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు. సామాన్యుల ట్రైన్ల బోగీలను తగ్గించి కేవలం ఉన్నత వర్గాల ట్రైన్లను మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పుడు మోడీ పాలనలో అన్నివర్గాల ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. కన్ఫమ్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కినా.. ప్రశాంతంగా కూర్చోలేకున్నారని తెలిపారు. సాధారణ ప్రయాణికులు కింద కూర్చుంటున్నారని, మరికొందరు టాయిలెట్‌లలోనూ కూర్చునే దుస్థితి నెలకొందని అన్నారు. మోడీ ప్రభుత్వం దాని విధానాలతో రైల్వే ప్రయాణం దుర్భరం అనే అభిప్రాయాన్ని తీసుకువచ్చి.. చౌకగా ఆయన మిత్రులకు అప్పజెప్పాలనే కుట్ర పన్నుతుదని ఆరోపించారు. సామాన్యుల రథాలైన రైళ్లను కాపాడుకోవాలంటే రైల్వే వ్యవస్థను నష్టపరుస్తున్న మోడీ ప్రభుత్వాన్ని తప్పించాల్సి ఉన్నదని ట్వీట్ చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!