Saturday, May 18, 2024

Exclusive

Rahul Gandhi: ‘పవర్ కోసం వచ్చిన లీడర్ మోడీ.. ప్రజల కోసం పోరాడే ఫైటర్ రాహుల్’

Jaggareddy: రాహుల్ గాంధీపై చోటా మోటా లీడర్లు కూడా సెటైర్లు వేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహించారు. రాహుల్ గాంధీ స్థాయి, చరిత్ర వేరు అని చెప్పారు. దేశంలో నేడు రాజకీయాలు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ చుట్టే జరుగుతున్నాయని వివరించారు. వీరిద్దరి గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. పవర్ కోసం వచ్చిన లీడర్ నరేంద్ర మోడీ అని, ప్రజల కోసం పోరాడే ఫైటర్ రాహుల్ గాంధీ అని తెలిపారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదివారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈటల రాజేందర్ రాజకీయ జీవితం రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని వివరించారు. ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అని తెలిపారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకులకు స్పష్టంగా తెలియజేస్తున్నానని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఏం చేశాడని పేర్కొంటూ అద్వానీ రథయాత్రకు ముందు ఆయన వెనుక ఉండి సేవ చేసేవాడని వివరించారు.

Also Read: ఈ ఆట ‘ప్రాణాలతో సయ్యాట’

అద్వానీ రథయాత్ర చేయడానికి ముందు ఈ దేశానికి, గుజరాత్ రాష్ట్రానికి మోడీ ఎవరో కూడా తెలియదని అన్నారు. రథయాత్ర పూర్తయ్యక గుజరాత్ ఎన్నికల్లో మోడీ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారని, ఆ తర్వాత అడ్వానీ సీల్డ్ కవర్‌లో మోడీని సీఎంగా ప్రకటించారని గుర్తు చేశారు. మోడీ సీల్డ్ కవర్ సీఎం అని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కాదని చెప్పగలరా? అని సవాల్ చేశారు. సీల్డ్ కవర్ సీఎం మోడీకి, అనేక రాష్ట్రాల సీఎంలను డిసైడ్ చేసే రాహుల్ గాంధీకి వ్యత్యాసం చాలా ఉన్నదని వివరించారు. ప్రధానమంత్రి కాకముందు మోడీ ఏం చేశారు? ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని అడిగారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్ అని, మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్ అని విమర్శించారు. అధికారం నుంచి వచ్చిన లీడర్ మోడీ అని, ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని వివరించారు.

రాముడు పేదల కోసం పాలన చేశారని జగ్గారెడ్డి అన్నారు. గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తా అని ఎప్పుడూ అనలేదని చెప్పారు. రామాలయ నిర్మాణంతో సమస్యలు పోయాయా? కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, సంజయ్‌లు రాజకీయంగా బతకాలి అంటే జై శ్రీరామ్ అనక తప్పదని విమర్శించారు. కానీ, శ్రీరామ చంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయేనని తెలిపారు. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు.

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటర్‌కు రూ. 500 చొప్పున డబ్బులు పంచాడని ఆరోపించారు. ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటా ఈ నెల 18న విడుదల కానుంది. మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు వీటిని టీటీడీ ఆన్‌లైన్‌లో...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు శుక్రవారం...