Delhi CM Aravind Kejriwal
జాతీయం

New Delhi : కేజ్రీవాల్ ఇన్సిలిన్ కి తెలంగాణ లింక్?

kejriwal stops insulin in Tihar Jail: తాను జైలుకు వచ్చి నెల రోజులైనా తనకు జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడంలేదని లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపిన నేపథ్యంతో జైలు అధికారులు స్పందించారు. కేస్రీవాల్ షుగర్ లెవెల్స్ ఆందోళనకరంగా లేవు. మందులు యథావిధిగా వేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయనకు ఇన్సులిన్ అవసరం లేదు అని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు జైలు అధికారులు వివరణ ఇచ్చారు. ఇంతకీ కేజ్రీవాల్ ఇన్సులిన్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం తెరపైకి వచ్చింది.  కేజ్రీవాల్ ఇన్సులిన్ కు తెలంగాణకు సంబంధం ఏమిటి?

జైలులో ఫుల్ స్టాక్ ఉన్న ఇన్సులిన్

తిహార్ జైలులో సరిపడా ఇన్సులిన్ స్టాక్ ఉంది. కేజ్రీవాల్‌కు అవసరమైతే వెంటనే దాన్ని అందించే వసతులు ఆస్పత్రిలో ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశానని స్వయంగా కేజ్రీవాలే చెప్పారు. అందుకే మేం ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదు అని నివేదికలో ప్రస్తావించారు. ఇక ఈ నివేదికపై ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిషి ఘాటుగా స్పందించారు. సరిపడా ఇన్సులిన్ స్టాక్ జైలులో ఉన్నా కేజ్రీవాల్‌కు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు ? ఆయన ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు ? అని ఆమె జైలు అధికారులను ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అతిషి ఆరోపించారు. గత 12 ఏళ్లుగా కేజ్రీవాల్ ప్రతిరోజూ ఇన్సులిన్‌ను తీసుకుంటున్నారని, అయితే గత నెలరోజులుగానే అది తీహార్ జైలు అధికారులు అందించడం లేదన్నారు.

తెలంగాణ ప్రైవేటు వైద్యుడితో ట్రీట్ మెంట్

కేజ్రీవాల్ తెలంగాణలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద షుగర్ ట్రీట్మెంట్ పొందేవారు. ఆ డాక్టర్ సూచన మేరకు కొన్ని నెలల క్రితమే ఇన్సులిన్ తీసుకోవడాన్ని కేజ్రీవాల్ ఆపేశారు. ప్రస్తుతం ఆయన మెట్‌ఫార్మిన్ అనే మధుమేహ నిరోధక ఓరల్ టాబ్లెట్‌ను మాత్రమే తీసుకుంటున్నారు. ‘‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఢిల్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని చెప్పుకునే కేజ్రీవాల్.. తెలంగాణ డాక్టర్ దగ్గర రహస్యంగా షుగర్ చికిత్స చేయించుకోవడం విడ్డూరంగా ఉంది. కనీసం ఆ చికిత్సకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కేజ్రీవాల్ దగ్గర లేవు’’ అని తమ నివేదికలో తిహార్ జైలు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!