Indian Soldier Plea: ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న జవాన్‌ది ఆంధ్రప్రదేశ్. అన్నమయ్య జిల్లాకు చెందిన ఈ జవాన్.. భారత్-పాక్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దేశ రక్షణలో.. ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్న ఈ జవాన్ భూమికి ఆంధ్రాలో రక్షణ కరువైంది. అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కొందరు కబ్జా చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు, పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు. దీంతో ఓ సెల్ఫీ వీడియోలో భూమిని కబ్జా చేసిన ఆక్రమణదారులు, పట్టించుకోని అధికారులపై జవాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గోడు విని, సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కోరారు. ‘ మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా?’ అంటూ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
పూర్తి వివరాల్లోకెళితే.. ఈ జవాన్ పారా మిలిటరీలో పనిచేస్తున్నారు. స్వగ్రామం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెంవారి పల్లి గ్రామం. స్వగ్రామంలో తన భూమితో పాటు 45 మంది భూమిని.. అలాగే ప్రభుత్వ భూమిని కూడా చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు ఆక్రమించారని గత నాలుగైదు నెలలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా కబ్జాదారులకే తహసీల్దార్ మద్దతుగా ఉంటున్నారని జవాన్ తెలిపారు. ఇంత జరుగుతున్నా కనీసం పోలీసులు అయినా పట్టించుకున్నారా? అంటే ఆ పాపానే పోలేదు. దీనిపై హైకోర్టులో కూడా జవాన్ సోదరుడు మోహన్ పిల్ వేశాడు. కేసు కోర్టులో ఉన్నా సరే కబ్జా భూమిపై ఆక్రమణదారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు.. దీనిపై వెంటనే స్పందించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
స్పందించండి.. పవన్!
ఇప్పటికే ఈ భూ వ్యవహారంకు సంబంధించి పలు వీడియోలను జవాన్, ఆయన సోదరుడు మోహన్ రిలీజ్ చేశారు. ఆ వీడియోల్లో కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారణాయుధాలతో దాడి చేసి, మహిళలను ఆక్రమణదారులు అసభ్యంగా బూతులు తిడుతున్నట్లుగా ఉన్నాయి. 2023లో భూములు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఎమ్మార్వో, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ అయినా స్పందించి.. సమస్యను పరిష్కరించాలని జనసేన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కోరుతున్నారు. మరోవైపు.. మన కోసం బోర్డర్‌లో పోరాటం చేసే వ్యక్తికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొన్నది ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తారనే నమ్మకంతోనే అని నెటిజన్లు కోరుతున్నారు. ‘ పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం వచ్చిందా లేదా అనేది తెలీదు. అలాగే ఈ రీట్వీట్ మీరు చూస్తారా లేదా అనేది కూడా తెలియదు. ఒక సైనికుడు యుద్దానికి వెళ్ళినప్పుడు అతను కోరుకొనేది తన త్యాగాన్ని గుర్తించి తన తోటి సమాజం తన కుటుంబానికి తోడుగా ఉంటుందనే నమ్మకంతో కానీ, ఆ నమ్మకం మనం ఆ సైనికునికి ఇవ్వలేని నాడు ఒక సమాజంగా మనం విఫలమైనట్లే. దయచేసి ఈ సమస్యను పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేలా అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను’ అని జనసైనికులు పెద్ద ఎత్తున కామెంట్స్, రీ ట్వీట్ చేస్తూ.. డిప్యూటీ సీఎంకు ట్యాగ్ చేస్తున్నారు.
Read Also- Drugs Case: షాకింగ్.. డ్రగ్స్‌కు బానిసైన నమ్రత.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
దేశ సరిహద్దుల్లో ప్రాణాలను తెగించి పోరాడుతున్న జవాన్ భూమికి రక్షణ కరువు
అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాకోరులు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు, పోలీసులు
మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా… https://t.co/liZ7dIE9DI pic.twitter.com/K8IIt604xK
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2025