Operation Kagar(image credit:X)
నార్త్ తెలంగాణ

Operation Kagar: రాష్ట్ర కమాండోలపై సీఆర్పీఎఫ్ కోబ్రాల బుల్లెట్ల వర్షం? వరంగల్ పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు!

Operation Kagar: తెలంగాణ రాష్ట్ర కమెండోలపై కోబ్రాల బుల్లెట్ల వర్షం కురిపించినట్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలు గత 18 రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఆపరేషన్ కర్రెగుట్టల్లో పాల్గొనడం లేదని సెంట్రల్ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కర్రెగుట్ట ప్రాంతంలో నిర్వహిస్తున్న కూంబింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అందరూ నమ్మారు. అయితే గురువారం మావోయిస్టులు అమర్చిన ఐఈడి బాంబు పేలి ఆర్ఎస్ఐ రణధీర్ తో పాటు శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ లు అక్కడికక్కడే మృత్యువాత చెందగా, ఆర్ఎస్ఐ కి సైతం తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ తరలించారు. అక్కడ రణధీర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమన్వయ లోపంతో కాల్పులు

కేంద్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వివిధ విభాగాల బలగాలు, తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్స్ కమాండోల మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టంగా కనిపించిందని చర్చ సాగుతుంది. మావోయిస్టులు అనుకునే తెలంగాణ గ్రేహౌండ్స్ కమాండోలపై కోబ్రా విభాగానికి చెందిన భద్రతా బలగాలు కాల్పుల వర్షం కురిపించినట్లు విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణ గ్రేహౌండ్స్ పార్టీకి చెందిన ముగ్గురు కమాండోలు మృతి చెందడం గమనాభం.

వరంగల్ పోస్టుమార్టంలో సంచలన విషయాలు

కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ముగ్గురు తెలంగాణ రాష్ట్ర గ్రేహౌండ్ కమాండోలు మృత్యువాత చెందారని, వారిని వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసుల నేతృత్వంలోనే పోస్టుమార్టం నిర్వహించడం అందరికీ అనుమానాలు కలిగేందుకు తావిచ్చింది.

అయితే ఐఈడి లు పేలితే పూర్తిస్థాయిలో శరీరం ముక్కలు ముక్కలుగా అవ్వాల్సి ఉంటుంది. లేదా శరీరంలో ఎక్కడ ఐఈడి ప్రెషర్ తగులుతుందో ఆ ప్రాంతమంతా నచ్చునచ్చుగా మారే అవకాశం ఉంటుంది. కానీ గురువారం మృతి చెందిన ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులకు బుల్లెట్లు తగిన తగిలిన గాయాల మాదిరిగా ఉండడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మావోయిస్టులు అనుకునే రాష్ట్ర బలగాలపై కోబ్రా కాల్పులు

ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ప్రాంతంలో వివిధ రకాల భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర పోలీసులు సైతం కర్రె గుట్టల ప్రాంతంలో నిర్వహిస్తున్న కూంబింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సమన్వయ లోపంతో బీజాపూర్ లోని ఉసురు బ్లాక్ లంకపల్లి వద్ద తెలంగాణ పోలీసులపై కోబ్రా భద్రతా బలగాలు మావోయిస్టులుగానే పరిగణించి కాల్పులు జరిపినట్లుగా విస్తృత చర్చ సాగడం విశేషం.

ఇక్కడ మరో అనుమానం కలుగుతుంది. దాదాపు 25 వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుంటే మావోయిస్టులు ఐఇడి బాంబులు పేల్చడం గాని, లేదంటే కాల్పులు జరిపితే వారు ఉన్న ప్రాంతం పోలీసులకు తెలిసిపోతుంది కదా… అలాంటప్పుడు మావోయిస్టులు పోలీసులపై కాల్పులు గాని, ఐఈడి బాంబులను పేల్చడం గాని ఎందుకు చేస్తారనేది ప్రధాన ప్రశ్న. వరంగల్ లో కమాండోల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన రిపోర్టు బుల్లెట్ గాయాలతోనే మృతి చెందినట్లుగా స్పష్టంగా వెళ్లడైనట్లు ప్రచారం సైతం సాగుతోంది. ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లుగా చర్చ సాగడం గమనార్హం.

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..