Electrical Supply Stores9image credit: swetcha reporter)
తెలంగాణ

Electrical Supply Stores: భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌కు సిద్దం.. సమీక్షలో కీలక నిర్నయాలు!

Electrical Supply Stores: ఇప్పటి వరకు కేవలం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రమే విద్యుత్ సామాగ్రి స్టోర్లు అందుబాటులో ఉన్నాయని, కాగా నూతనంగా ఏర్పాటుచేసిన ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విద్యుత్ స్టోర్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యుత్ సంస్థల సీఎండీలను ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెరుగుతున్న భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం గా రానున్న ఐదు సంవత్సరాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించాల్సిందిగా ఆదేశించారు.

ఈ ప్రణాళికకు సంబంధించి సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. కాగా విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ సంస్థల సీఎండీలు రానున్న ఐదేండ్లలో నమోదయ్యే డిమాండ్ అంచనాలు, దానికి తగ్గట్టుగా సంస్థలు చేపట్టబోతున్న కార్యాచరణపై నివేదికలు ప్రవేశపెట్టారు. కాగా ఐదేండ్ల కార్యాచరణ నివేదికలను నిశితంగా పరిశీలించిన ఉప ముఖ్య మంత్రి భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ పలు అంతర్జాతీయ సంస్థలకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందన్నారు. ఇటీవల, పలు అంతర్జాతీయ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్, మాన్యుఫాక్చరింగ్ సంస్థలు తమ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరిస్తున్నాయన్నారు.

 Also Read:Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కు పూర్తి మద్దతు.. దేశ భద్రతపై అందరిని కేంద్రం కలుపుకుపోవాలి!

రాష్ట్రము లో అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ నమోదవుతోందని, గతేడాదితో పోల్చుకుంటే గరిష్ట డిమాండ్ దాదాపు 10 శాతం పెరిగినా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ వుద్యోగులందరూ అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. భవిష్యత్ తరాలకు సైతం నాణ్యమైన విద్యుత్ సరఫరా నిత్యం అందుబాటులో ఉండేందుకు ఇప్పటి నుండే కృషి చేయాలని స్పష్టంచేశారు. విద్యుత్ సంస్థల కార్యాచరణ విజయవంతంగా పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉండగా విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జెన్ కో, ట్రాన్స్ కో, ఉత్తర, దక్షిణ పంపిణీ సంస్థలు, రెడ్ కో ప్రస్తుత పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి భట్టికి నివేదించారు. మే 1 నాటికి ప్రస్తుత కెపాసిటీ 20,883 మెగావాట్లు, మొత్తం కాంట్రాక్ట్డ్ కెపాసిటీ తో కలిపి 26,183 మెగావాట్లుగా ఉందన్నారు. 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకు చేరనుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసిందన్నారు. ఈ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు సింగరేణి, ఎన్టీపీసీ, జెన్ కో వంటి విద్యుత్ ఉత్పాదన సంస్థలు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. అనంతరం ట్రాన్స్ కో సీఎండీ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ.. 2024లో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ తో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట డిమాండ్ లో 9.8 శాతం పెరిగిందన్నారు.

 Also Read: Indiramma Houses: జర్నలిస్టుల సంక్షేమం కోసం.. కొత్త ఆర్థిక సహాయం!

ఈ ఏడాది రాష్ట్రంలో అత్యధిక డిమాండ్ 16,877 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనా వేసిందని, కానీ గరిష్ట డిమాండ్ 17,162 మెగావాట్లుగా రికార్డయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ ట్రాన్స్ ఫర్మేషన్ కెపాసిటీ 41,954 మెగావాట్లుగా ఉందని వివరించారు. డిసెంబర్ 2023 నుంచి ఈ ఏడాది మే నాటికి 3,158 ఎంవీఏ కెపాసిటీని జోడించినట్లు వివరించారు. ప్రస్తుతం 389 ఈహెచ్ టీ సబ్ స్టేషన్లను 2030 నాటికి అదనంగా 122 నిర్మించి మొత్తం 511 సబ్ స్టేషన్లకు పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి భట్టికి వివరించారు. ఎస్పీటీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో గతేడాది 9,862 మెగావాట్లుగా వున్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది 10.48 శాతం పెరిగి 11,017 మెగావాట్లకు చేరిందని తెలిపారు.

ఈ ఏడాది 10 వేల మెగావాట్ల మైలురాయిని సునాయాసనంగా రీచ్ అయినట్లు చెప్పారు. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోల్చుకుంటే 33.69 శాతం పెరిగిందన్నారు. సంస్థ పరిధిలో గతేడాది జరిగిన విద్యుత్ వినియోగాన్ని బట్టి ఆ ప్రాంతాలను 4 కేటగిరీలుగా విభజించామని, ఐదేండ్ల కార్యాచరణ కు సంబంధించి నూతనంగా 5330 ఎంవీఏ కెపాసిటీ కలిగిన 410.., 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ పరిధిలో గతేడాది 5,816 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ ఈ ఏడాది 6,281 మెగావాట్లకు పెరిగిందన్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా గరిష్ట డిమాండ్ 24.64 శాతం పెరిగిందన్నారు.

 Also Read: MLA Kadiyam Srihari: దేవుడి భూములపై.. అక్రమ ఆక్రమణలకు ఆస్కారం లేదు.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే!

తమ సంస్థ పరిధిలో కూడా డిమాండ్ పెరుగుతున్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించమన్నారు. ఐదేండ్ల కార్యాచరణ కు సంబంధించి నూతనంగా 1710 ఎంవీఏ కెపాసిటీ కలిగిన 342 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశామన్నారు. రెడ్ కో వీసీఎండీ అనిల మాట్లాడుతూ.. తెలంగాణాలో 7913 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయని, 2030 నాటికి 19,874 మెగావాట్లకు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు.

దీనికి తోడు తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా డిస్ట్రిబ్యూటెడ్ రేనేవబుల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్, జియో థర్మల్, ఈవీ చార్జర్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 23 గ్రామాలను, రెండు మండలాలను పూర్తిగా సౌర విద్యుద్దీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందించనున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా సోలరైజేషన్ చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ