Kamal Haasan Message
ఎంటర్‌టైన్మెంట్

Kamal Haasan: ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా కమ్స్ ఫస్ట్.. గుండెలు పిండేసిన కమల్ హాసన్

Kamal Haasan: ఉలగనాయగన్ కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో చాలా గ్యాప్ తర్వాత రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life). మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా, భారీ తారాగణంతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సిద్ధమవుతోంది. జూన్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ తేదీని దృష్టిలో పెట్టుకుని, చిత్ర ప్రమోషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా మే 16న భారీస్థాయిలో ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించాలని టీమ్‌ భావించింది. కానీ, ప్రస్తుత భారత్, పాక్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కమల్‌హాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Also Read- Allu Aravind: ‘ఆపరేషన్ సింధూర్’.. అల్లు అరవింద్ సంచలన నిర్ణయం!

‘ఆర్ట్ కెన్ వెయిట్-ఇండియా (India) కమ్స్ ఫస్ట్’ అంటూ ఈ యూనివర్సల్ హీరో ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో.. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మే 16న నిర్వహించాల్సిన ‘థగ్ లైఫ్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాము. మన దేశాన్ని రక్షించేందుకు మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండి పోరాడుతున్న వేళ, ఇది వేడుకలకు సమయం కాదని మా టీమ్ అంతా భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయమని నేను నమ్ముతున్నాను. ఆడియో విడుదలకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో సముచితమైన సమయంలో ప్రకటిస్తాం. ఈ కష్ట సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలని కోరుతున్నాను’’ అని కమల్ హాసన్ తెలియజేశారు. (Kamal Haasan Thug Life)

Kamal Haasan Message
Kamal Haasan Message

Also Read:Allu Arjun: డ్యూయల్ రోల్.. అయ్యబాబోయ్! అట్లీతో అల్లు అర్జున్ రిస్క్ చేస్తున్నాడా?

కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయంలో ఆయన అభిమానులు, నెటిజన్లు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బయట ఏమైనా ఉండొచ్చు.. దేశం అనే సరికి మేమంతా ఒకటే అని నిరూపించారు సార్, గుండెలు పిండేశారు సార్, మీరు రియల్ హీరో అని నిరూపించుకున్నారు సార్.. అంటూ నెటిజన్లు కమల్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో రెండు పవర్ హౌసెస్ ఉలగనాయగన్ కమల్ హాసన్, విజనరీ డైరెక్టర్ మణిరత్నం మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ ‘థగ్ లైఫ్’ సినిమాతో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో లెజెండరీ మూవీ ‘నాయకుడు’ (Nayakudu) వచ్చి, భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఇప్పుడు రాబోతున్న ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?