MLA Kadiyam Srihari: చిన్న పెండ్యాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకుందామని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. చైర్మన్ గా రామడుగు బుచ్చి కొమురయ్య, ధర్మకర్తలుగా భూక్య తిరుపతి నాయక్, తాళ్లపల్లి శివకుమార్, భీమగోని అనిత మొగిలి, కొత్తపల్లి యాకరాజు పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి 206 ఎకరాల భూమి ఉండి కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కాలేదని అన్నారు. 206 ఎకరాల దేవుడి భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిదేనని స్పష్టం చేశారు. భూ అక్రమణకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. 206 ఎకరాలలో సాగుకు ఎంత అనుకూలంగా ఉందో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు.
Alos Read: Operation Kagar: ఆదివాసులపై దాడులను ఆపండి.. కేంద్రానికి వామపక్షాల హెచ్చరిక!
ఎంత మంది రైతులు దేవస్థాన భూమి కౌలు చేస్తున్నారు, కౌలు చెల్లెస్తున్నారా సమాచారం సేకరించి కౌలు చెల్లించకపోతే వారి కౌలును రద్దు చేసే విధంగా తీర్మానం చేయాలని తెలిపారు. ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం తో లైటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం 10 లక్షలతో మండపం నిర్మాణం చేపడుతానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Also Read:GHMC: శిథిల భవనాల సర్వే మొదలైంది.. అప్రమత్తంగా ఉండండి!
చిన్నపెండ్యాల వద్ద జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు అయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయాని తెలిపారు. జాతీయ రహదారి నుండి నాలుగు లైన్ల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు త్వరలోనే మంజూరు వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గడ్డమీద సురేష్, మామిడాల లింగారెడ్డి, తాళ్లపల్లి సంపత్ కుమార్, తాళ్లపల్లి ఉమా సమ్మయ్య, మామిడాల యాదవ రెడ్డి, లిక్ బుచ్చయ్య, మహేందర్ రెడ్డి, గుంపుల రవీందర్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవస్థానం డైరెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు