Operation Kagar: తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ లో భాగంగా నిర్వహిస్తున్న కూంబింగ్ లను వెంటనే ఆపివేయాలని మహబూబాబాద్ జిల్లా వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన సెంటర్లలో వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి భామనపల్లి విజయ సారథి, సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ ఏఐటియుసి నాయకులు ఆకుల రాజు, పాయం చిన్న చంద్రన్న, గౌని ఐలయ్య, కంచ వెంకన్న, బుర్ర ఆనంద్, మదర్ లు మాట్లాడుతూ… ఇప్పటికే మావోయిస్టుల సైడు నుంచి శాంతి చర్చల కోసం నాలుగు సార్లు లేఖలను లేఖలను విడుదల చేశారన్నారు.
Also Read: GHMC: శిథిల భవనాల సర్వే మొదలైంది.. అప్రమత్తంగా ఉండండి!
తాజాగా కాల్పుల విరమణ కు సైతం అంగీకరిస్తూ ఓ లేఖను సైతం రాశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చల వైపు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ పేరిట గిరిజనులపై జరుగుతున్న అక్రమ దాడులను తక్షణమే ఆపేయాలని కోరారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఈ కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దాడుల పేరిట ఆదివాసి గిరిజనులను చంపుతున్నారని మండిపడ్డారు. బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలని డిమాండ్ చేశారు. సానుకూల వాతావరణంలో మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.
ప్రస్తుతం కర్రెగుట్టల ప్రాంతంలో కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలను వెంటనే అక్కడి నుంచి తిరిగి పంపించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మావోయిస్టులు శాంతి చర్చలు జరిపేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి, గునిగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, హలవత్ లింగ నాయక్, భాస్కర్ రెడ్డి, నందగిరి వెంకటేశ్వర్లు, గుజ్జు దేవేందర్, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, చొప్పరి శేఖర్, స్వామి, మహేందర్, బొమ్మయ్య, శ్రావణ్, అశోక్, రమేష్, మంద శంకర్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు