Srinidhi Shetty: కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. కే జి ఎఫ్ 1,2 తో ఆమె రేంజ్ మొత్తం మారిపోయింది. అంతక ముందు వరకు ఈ హీరోయిన్ సరిగా ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే కేజీఎఫ్ చిత్రం మన ముందుకొచ్చిందో.. ఆ తర్వాత ఆమెకు పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే, తాజాగా శ్రీనిధి శెట్టి నాని సరసన హిట్ – 3 లో నటించి మంచి విజయం సాధించింది. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఎన్నో ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాలను కూడా బయటకు వెల్లడించింది.
Also Read : Viral Video: ఏ బ్రాండ్ తాగావ్ బాబు.. కుక్కను తెచ్చి పిల్లికి వైద్యం చేయమంటున్నావ్.. వీడియో వైరల్
అలా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి ( Srinidhi Shetty)తన లైఫ్ లో పడిన కష్టాల గురించి చెప్పింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన జీవితం మొత్తం అయిపోయిందంటూ శ్రీనిధి శెట్టి మాట్లాడిన మాటలు కన్నీరు పెట్టిస్తుంది. శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పదవ తరగతిలోనే మా అమ్మని కోల్పోయాను. అమ్మ చనిపోవడంతో నా జీవితం అక్కడితో ముగిసిపోయింది అనుకున్నాను.
Also Read : Anupama: విడాకులు తీసుకున్నస్టార్ హీరోతో అనుపమ డేటింగ్.. రొమాంటిక్ సీన్స్ ఇష్టపడే చేసిందా?
శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. నేను పదో తరగతి చదువుతున్నపుడే మా అమ్మని కోల్పోయాను. అమ్మ నాతో లేకపోవడంతో నా జీవితం నాకు నరకంగా అనిపించింది. ఇక అక్కడితోనే ముగిసిపోయింది అనుకున్నాను. మా అమ్మలేని ఇంట్లో నేను ఉండలేకపోయాను. ఇక నేను నా బ్యాగ్ సర్దుకుని బెంగళూరుకి వచ్చేసాను. అదే సమయంలో ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి మోడలింగ్ చేసి మూవీస్ లోకి వచ్చాను. అయితే, ఇదంతా గుర్తొచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. తల్లి చనిపోవడంతోనే అక్కడే జీవితం ముగిసిపోయిందనుకున్న.. అంత బాధను గుండెల్లో దాచుకుని ఇక్కడి వరకు వచ్చానంటే నాకు ఇది గొప్ప విషయం. అప్పుడు నరకం అనుభవించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.