Anupama: అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు యంగ్ హీరోస్ అందరితో సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేస్తుంది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఎంత ఫేమ్ సంపాదించిందో దానికి తగ్గట్టు రూమర్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన రూమర్ అయితే మరి.. పెళ్ళై విడాకులు తీసుకున్న స్టార్ హీరోతో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. అతను బాలీవుడ్ లేక టాలీవుడ్ లేక కోలీవుడ్డా అని ఆలోచిస్తున్నారా? అతనేవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో సమంత పోస్ట్.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ కొంచం స్లో అయింది. ఎందుకంటే ఈమె నుంచి సినిమా వచ్చి ఆరు నెలలు అవుతుంది. ట్రెండింగ్ లో లేదు. అయితే, ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అనుపమ తమిళ హీరోతో ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. గత కొంత కాలం నుంచి వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళడం, పార్టీలకు తిరగడం వంటివి చూస్తుంటే వీరు రిలేషన్ లో ఉన్నారనే వార్తాకు బలం చేకూరింది. అంతే కాదు, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ పుకార్లు నడుస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియయాల్సి ఉంది.