Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకే మాట మీద ఉంటే, మంచు మనోజ్ మాత్రం వారిద్దరిపై ఫైట్ చేస్తున్నారు. ఆస్తి కోసం కాదని మంచు మనోజ్ చెబుతున్నాడు కానీ, విషయం మాత్రం అదే అని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా జల్‌పల్లిలో ఉన్న ఇంటి గురించే వీళ్లంతా పోట్లాడుకుంటున్నారనేలా, వాళ్ల గొడవను చూసిన వారంతా ఓ క్లారిటీకి వచ్చేశారు. మంచు మనోజ్ ఒంటరి పోరాటం చేస్తుంటే.. మోహన్ బాబు, విష్ణు మాత్రం అతని పోరాటాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
Also Read- Operation Sindoor Title: ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం భారీ పోటీ.. ఓ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు!
కుటుంబ పరువు పోతున్నా కూడా మోహన్ బాబు వాళ్లని కూర్చోబెట్టి మాట్లాడలేని పరిస్థితికి ఇష్యూని తీసుకెళ్లారు. ప్రస్తుతం వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు మంచు లక్ష్మి మాత్రం ఈ గొడవలేం నాకు పట్టవ్ అన్నట్లుగా.. ముంబైకి మకాం మార్చేసింది. ఏదైనా పనో, ఫంక్షనో ఉంటే తప్ప.. హైదరాబాద్ రావడం లేదు. ముంబై వీధుల్లో ఆమె హాట్ హాట్ తయారై కనిపిస్తున్న ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె ముంబై వెళ్లిపోవడంపై అభిమానులు కొందరు మంచి నిర్ణయం అంటూ మంచు లక్ష్మి నిర్ణయానికి సపోర్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా మంచు మనోజ్‌పై మంచు లక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో టీచ్ ఫర్ ఛేంజ్ ఈవెంట్‌ని మంచు లక్ష్మి నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడకి మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి వెళ్లారు. చాలా గ్యాప్ తర్వాత తన ఇంటి మనిషిని చూసిన మంచు లక్ష్మి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. మంచు మనోజ్‌ని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. మనోజ్ అంతకు ముందు రోజే నడిరోడ్డు మీద నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఒంటరిగా పోరాడుతున్నాడని, తనకు అన్యాయం జరిగిందని మంచు లక్ష్మి ప్రవర్తనతో అంతా అనుకున్నారు.
Also Read- 6Journey: శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి?
ఇప్పుడా ఘటనపై మరింత క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి. ఆ రోజు ఎందుకంత ఎమోషన్ అయిందో తాజాగా ఆమె అటెండ్ అయిన ఓ బుల్లితెర కార్యక్రమంలో తెలిపింది. ఆ రోజు జరిగిన టీచ్ ఫర్ ఛేంజ్ వేడుకకు అంతా ఫ్యామిలీస్‌తో వచ్చారు. నేను ఒక్కదాన్నే ఒంటరిగా కనిపించాను. నా జీవితంలో మంచు మనోజ్ ఒక ఇరిటేటింగ్ క్యారెక్టర్. అలాంటి వాడిని అక్కడ చూసే సరికి ఒక్కసారిగా ఆనందంతో ఎమోషనల్ అయ్యాను. ఎంత దూరంలో ఉన్నా, ఫ్యామిలీ పక్కన ఉంటే వచ్చే స్ట్రెంతే వేరు. ఇంటిలో ఎలాంటి గొడవలు ఉన్నా.. మేమిద్దరం మాత్రం చాలా ఫ్రెండ్లీగానే ఉంటాం. మా బంధం అలాంటిదని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు