Operation Sindoor Title: ‘ఇకపై భారతదేశం సైలెంట్‌గా ఉండదు. ఎవరైతే భారత్‌కు బాధని కలిగిస్తారో.. వాళ్లకి సునామీ చూపిస్తాం. ఇది సరికొత్త భారతదేశం’ అని నిరూపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ. పహల్గాంలో ఉగ్రదాడి చేసి, పర్యాటకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ ఉగ్రస్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో మెరుపుదాడి చేస్తూ, వాటిని మట్టు బెట్టేస్తుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ‘ఆపరేషన్ సింధూర్’ గురించే మాట్లాడుకుంటోంది. ఒకటి రెండు దేశాలు మినహా.. మిగతా అన్ని దేశాలు ఈ ‘ఆపరేషన్’కు మద్దతు తెలుపుతున్నాయి. పాకిస్తాన్‌లో భారత్ నిర్వహిస్తున్న దీపావళికి చుట్టు పక్కల ఉన్న దేశాలు సెలబ్రేట్ చేసుకుంటుండటం విశేషం.
Also Read- Sreeja Marriage: శ్రీజకు చిరంజీవి అందుకే మూడో పెళ్లి చేయలేదా?
ఇదిలా ఉంటే, భారత్ సైన్యం (Indian Army) చేపట్టిన ఈ ఆపరేషన్‌పై సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. మన సైన్యాన్ని మెచ్చుకుంటూనే దాదాపు నిర్మాతలెందరో ఈ ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ కోసం పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ (Bollywood) అనే కాకుండా అన్ని సినిమా ఇండస్ట్రీలలో కలిపి దాదాపు 15కి పైగా నిర్మాణ సంస్థలు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించేందుకు పోటీ పడుతుండటం చూస్తుంటే ఈ ‘ఆపరేషన్ సింధూర్’ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు 15 మంది నిర్మాతలు దరఖాస్తు చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. ఇంతకు ముందు ఇలాంటి ఉగ్రదాడులపై మరీ ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధంపై చిత్రీకరించిన ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇండియన్స్‌కి ఇదొక సెంటిమెంట్‌గా మార్చేశాయి. అందుకే, నిర్మాతలు ఈ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్న వారిలో, టీ సిరీస్, జీ స్టూడియోస్ సంస్థలు కూడా ఉండటం విశేషం. అయితే ఎంత మంది పోటీ పడినా, ఈ సినిమా కోసం దరఖాస్తు చేసుకున్న లిస్ట్‌లో మాత్రం ‘మహా వీర్ జైన్ ఫిల్మ్’ మొదటి స్థానంలో ఉంది.
Also Read- Trisha Krishnan: వామ్మో.. 42 ఏళ్లలో ఇంత మంది ప్రియులా? దానికి కారణమిదే!
ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న నిర్మాతలలో ఒకరైన అశోక్ పండిట్ (Ashoke Pandit) మాట్లాడుతూ.. ఇలా జరగడం ఇప్పుడే కాదు, జనాలందరిలోకి వెళ్లిన టైటిల్స్‌ని సినిమాలకు టైటిల్‌గా పెట్టుకోవడం అనేది ఎప్పడి నుంచో ఉంది. ఇలా దరఖాస్తు చేసిన వారంతా, సినిమా చేస్తారని అనుకోలేం. ఆ వేడి ఉన్నప్పుడు అందరూ ఎగబడుతుంటారు. తర్వాత నార్మల్ అయిపోతారు. కానీ, నాకు ఈ టైటిల్ చాలా కీలకం. భారత్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో నాకు తెలుసు. నేను కూడా బాధితుడినే. దాదాపు 35 సంవత్సరాలుగా పాకిస్తాన్‌పై పోరాటం చేస్తున్నా. పాక్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన వాడిని కాబట్టి.. ఆ ప్రభావం నాపై ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ టైటిల్‌తో నేను సినిమా చేస్తేనే సబబుగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, తమ అనుమతి లేకుండా ఒకరు తమ పేరు మీద దరఖాస్తు చేశారని జియో స్డూడియోస్, ఆ దరఖాస్తును ఉపసంహరించుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ పట్ల మేమంతా ఎంతో గర్వపడుతున్నాం. భారత్ ప్రభుత్వానికి, సైన్యానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని తెలిపింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు