6 Journey Producer
ఎంటర్‌టైన్మెంట్

6Journey: శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి?

6Journey: శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఈ లైన్ వింటుంటే ఏదో తెలియని పౌరుషం పొడుచుకుని వస్తుంది కదా! అలాంటి ఫీల్‌ని ఇస్తుందని అంటున్నారు దర్శకుడు బసీర్ ఆలూరి. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 9న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Khans of Bollywood: ‘ఆపరేషన్‌ సింధూర్’పై ఒక్క ఖాన్ కూడా స్పందించలే.. వీళ్లు మనకి అవసరమా?

‘‘సినిమా ఇండస్ట్రీలో ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. ఇంతకు ముందు తెలుగులో ‘సమరం’, కన్నడలో మరో చిత్రం చేశాను. ఇప్పుడు నా మూడో సినిమా ‘6 జర్నీ’తో మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి లైఫ్ జర్నీ. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలనుకునే ఓ బ్యాచ్ కథే ఈ సినిమా. ఈ బ్యాచ్ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితులకు వారు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేదే ఈ సినిమా కథ.

సమీర్, పల్లవి జంట చక్కగా నటించారు. వారికి మంచి భవిష్యత్ ఉంటుంది. కొత్త అబ్బాయి అభిరాం విలన్‌గా అభినయంతో ఆకట్టుకుంటాడు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ ఇలా అందరూ అద్భుతంగా ఈ సినిమాకు వర్క్ చేశారు. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తానని అన్నారు. మాకు ఎంతగానో సహకారాన్ని అందించారు. వర్షాకాలంలో ఈ మూవీ షూటింగ్ చేశాం. షూటింగ్ సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినా ప్రకృతి మాకు ఎంతో సహకరించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాం.

Also Read- Sreeja Marriage: శ్రీజకు చిరంజీవి అందుకే మూడో పెళ్లి చేయలేదా?

మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి? అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా రూపొందించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అక్టోబర్‌లో ఓ సినిమాను చేయబోతున్నాను. ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఆ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉంది. పూర్తి వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు