Swetcha Effect: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా సాగాలని హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశాలు జారీ చేశారు.
సరైన వసతులు లేక తుకాలు సరిగా కాకపోవడం, తరుగు, తాలు, తేమ పేరుతో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు అసౌకర్యాల నిలయాలు అనే శీర్షికన స్వేచ్ఛ లో ప్రచురితమైన ప్రత్యేక కథనానికి స్పందించిన కలెక్టర్లు ఐకెపి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పెద్దపహాడ్, గోపరాజుపల్లి లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య నడికూడ మండలంలోని చర్లపల్లిలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డిమాండ్ కు అనుగుణంగా సౌకర్యాలు చేపట్టాలి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వరి ధాన్యంకు అనుగుణంగా ముందస్తుగా ప్రత్యేక దృష్టి పెట్టి ధాన్యం కొనుగోళ్ల, రవాణా విషయంలో నిత్యం తనిఖీలు పర్యవేక్షణలు చేస్తూ కేంద్రాల నిర్వహకులను సిబ్బందిని హమాలీలను, లారీలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లు సూచించారు. కేంద్రాల నుండి మరింత వేగంగా రైస్ మిల్లులకు ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకావాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రవాణా చేయు సందర్భాలలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం కాకుండా వెనువెంటనే తూకం వేయించి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని కలెక్టర్లు పేర్కొన్నారు.
Also Rea: Maoists Surrendered: ప్రజల మధ్యే శాంతి.. మావోయిస్టుల కొత్త జీవన యాత్ర!
కేంద్రాలలో ప్రభుత్వం సూచించిన సూచనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అన్ని కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలు, రైతుల ఖాతా వివరాలను ఎలాంటి ఆలస్యం కాకుండ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని కేంద్రాలలో టార్పాలిన్స్ , అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు, రవాణా చేయు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు కలెక్టర్లు సూచించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు