Sreeja and Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Sreeja Marriage: శ్రీజకు చిరంజీవి అందుకే మూడో పెళ్లి చేయలేదా?

Sreeja Marriage: మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు తిరుగులేదు. ఈ పేరే ఒక శాసనం. స్వయంకృషితో పైకి వచ్చి, దాదాపు 4 దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ.. ఇప్పటికీ తన స్టామినా చూపిస్తూనే ఉన్నారు. కొన్నాళ్లపాటు రాజకీయాలంటూ బయటికి వెళ్లినప్పటికీ, రీ ఎంట్రీతో తన చరిష్మా ఏం తగ్గలేదని నిరూపించుకుని, అక్కడి నుంచి నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అవార్డుల పరంగానూ ఆయనకు తిరుగులేదు. మరోవైపు అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఆయనను సముచితంగానే గౌరవించుకుంటూ వస్తున్నాయి. అయితే ఇన్ని ఉన్న చిరంజీవికి ఒకే ఒక్క లోటు ఉందని తెలుస్తుంది.

Also Read- Sree Vishnu: ‘శ్వాగ్’ రిజల్ట్‌పై హీరో శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

అదేంటో కాదు.. తన చిన్న కుమార్తె శ్రీజ వివాహం. ఈ అంజనమ్మ పుత్రునికి ముగ్గురు సంతానం. అందులో సుస్మిత, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయంలో చిరు చాలా హ్యాపీగా ఉన్నారు. సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా బిజీగా ఉంటూ, తన లైఫ్‌ని చక్కగా లీడ్ చేస్తుంది. ఇక రామ్ చరణ్ గురించి చెప్పేదేముంది. చిరంజీవిని మించిన స్థానం అని అనలేం కానీ, దాదాపు ఆ రేంజ్‌కి చేరుకున్నాడు. గ్లోబల్ స్టార్ రేంజ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపును పొందారు. పాన్ ఇండియా హీరోగా ముద్ర వేయించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా, తండ్రికి తగ్గ తనయుడిగా విజయవంతంగా దూసుకెళుతున్నారు.

ఇక మిగిలింది చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ. ఈ చిన్న కుమార్తె విషయంలోనే చిరు నిరాశలో ఉన్నారు. కోట్లకు కోట్ల సంపద ఉంది. మంచి ఫ్యామిలీ ఉంది. ఇక చిరుకి శ్రీజ విషయంలో దిగులు ఎందుకని అనుకుంటున్నారా? ఏ ఆడపిల్ల అయినా ఇంట్లో ఉంటే, తల్లిదండ్రులకు భారం కాదు. చిరంజీవి వంటి వారికి అసలిది విషయమే కాదు. కానీ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు. రెండు సార్లు పెళ్లి, విడాకులు అయిన శ్రీజ విషయంలో మాత్రం చిరు లోలోపల బాధని దాచుకుంటున్నారనేది మెగా వర్గాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు.

Also Read- Happy Days Meme: దువ్వాడ, అఘోరి, అన్వేష్, బెట్టింగ్ బ్యాచ్.. ‘హ్యాపీ డేస్’ మీమ్‌తో అల్లరల్లరి!

చక్కగా భర్త, పిల్లా పాపలతో కన్నబిడ్డలు హ్యాపీగా ఉంటే చూడాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. వారికి అంతకు మించిన ఆనందం ఏముంటుంది. కానీ శ్రీజ విషయంలో మొదటి నుంచి చిరంజీవి పేరు వార్తలలో నిలుస్తూనే ఉంది. శ్రీజను చిరంజీవి చూసుకోలేడు అని కాదు కానీ, ఒంటరిగా అలా లైఫ్‌ని లీడ్ చేస్తుంటే ఏ తండ్రికైనా బాధగానే ఉంటుంది. రెండు సార్లు కాదు, మూడోసారి అయినా పెళ్లి చేసి, తనని సంతోషంగా చూాడాలని చిరు ఆలోచించే ఉంటారు. కాకపోతే, ఇలా రెండు సార్లు జరిగింది కదా అని ఒకసారి ఆమె జాతకం చూపించారట.

శ్రీజ జాతకంలో వైవాహిక జీవితం అంతగా కలిసి రాదని, మూడో పెళ్లి చేసినా.. మళ్లీ విడాకుల వరకు వెళుతుందని జాతకం చూసిన పండితులు చెప్పారట. అందుకే శ్రీజకు మూడో పెళ్లి చేయాలనే ఆలోచనను చిరంజీవి విరమించుకున్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే తన కుమార్తె, మనవరాళ్లను ఇంటిలోనే పెట్టుకుని, వారి బాగోగులను చిరంజీవే చూసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే శ్రీజకు మూడో పెళ్లి చేసే ఆలోచన ఆ ఫ్యామిలీలో అయితే లేదని, అందుకు జాతకమే కారణమని మాత్రం తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు