Operation Kagar: మవోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం, ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) రాష్ట్ర భద్రతా బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్టులను ఏరి వేసేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రె గుట్టల్లో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన ఆరుగురు మృతి చెందినట్లు తొలిసారిగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
Also Read: Allegations on GHMC: గులాబీ పాలన హయాంలో అక్రమ నియామకాలు.. కొత్త సర్కారుకు ఎదురైన సవాళ్లు!
కర్రె గుట్టల దగ్గర దాదాపు 16 రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కూడా స్పందించని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మొదటిసారిగా ఎన్ కౌంటర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. గతంలో ఐదుగురు, మంగళవారం సాయంత్రం ఒకరు సహా మొత్తం 12 మంది మావోయిస్టులు కర్రె గుట్టల ప్రాంతంలో హతమైనట్టు అధికారిక ప్రకటన చేశారు.
ఒకవైపు పాకిస్తాన్ ముష్కరులతో పోరాటం చేస్తున్న మన జవాన్లు అక్కడ సైతం విజయం సాధించి భారత జెండాను రెపరెపలాడించారు. అదేవిధంగా కర్రె గుట్టల ప్రాంతంలో కొంత విజయం సాధించినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఎవరూ పూర్తిగా స్పందించలేదు. కానీ, తొలిసారిగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మాట్లాడుతూ, మావోయిస్టులపై విజయం సాధిస్తున్నామని సంకేతాలు పంపేందుకే ఎన్ కౌంటర్ వివరాల ప్రకటన చేసినట్లుగా అందరూ భావిస్తున్నారు.
రాత్రి సమయం వరకు మావోయిస్టులపై మరికొంత పట్టు సాధించేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఎట్టకేలకు నక్సల్స్‌ను హతమార్చడం అందుకు సంబంధించి వివరాలను సైతం అధికారికంగా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించడం, భద్రతా బలగాలు సాధించిన విజయంగా పేర్కొనవచ్చు.
బుధవారం తెల్లవారుజామున కర్రె గుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో 22 మంది మావోయిస్టులు హతమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా వైరల్ అవుతున్నది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించిన భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను మంగళవారం మధ్యాహ్నం కనిపెట్టారు. ఏడుగురు మావోయిస్టుల కదలికలను బట్టి వారిని భద్రతా బలగాలు వెంబడించినట్లు తెలిసింది. వారిని అనుసరిస్తున్న క్రమంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు దిగినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌ను ఏడీజీ వివేకానంద్ సిన్హా పర్యవేక్షిస్తున్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ప్ర కటన ద్వారా వెల్లడించారు.
Also Read: BJP on CM Revanth: సీఎం రేవంత్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్..!