BJP on CM Revanth: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలేటి మాట్లాడుతూ, రాష్ట్రం దివాళా తీసిందని సీఎం పదే పదే చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.? ఇచ్చిన హామీలని ఎగ్గొట్టేందుకు ఈ ప్లాన్ ని చేపస్తున్నారా అని, సీఎం ప్రజలని ప్రిపేర్ చేస్తున్నారని అన్నారు. తుమ్మల నాగేశ్వరావు కూడా ఉచితాలు వద్దు అని చెప్పుతున్నారని, సీఎం అంటే ప్రజలకి బరోసా కల్పించాలి కానీ ఉద్యోగస్థుల మీదకి ప్రజలను ఎందుకు ఉసిగొల్పుతున్నారని ఆయన అన్నారు.
కాంట్రాక్టర్ల వద్ద B ట్యాక్స్ వసూలు చేయడం లేదా మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉందని అనుకున్న అని, సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలను ఆఫ్ చేయాలనే సీఎం ఈవిధంగా మాట్లాడుతున్నారని, భారత్ జోడో యాత్రలో ఐదు లక్షల కోట్ల రూపాయల పైనే అప్పు ఉంది అని చెప్పలేదా అని ఎలేటి గుర్తుచేశారు. ప్రతి మహిళకి రెండువేల రూపాయల మహాలక్ష్మి పథకం, కౌలు రైతులకి ఇస్తాము అన్న 12 వేలు అనేక అంశాలని ఎత్తేయడానికి ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
Also Read: Chattisgarh Crime: మావోయిస్టుల ఘాతుకం.. గొంతు కోసి ప్రజా ప్రతినిధి దారుణ హత్య..
ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బీజేపీ ప్రజా ఉద్యమం చేస్తాం మని, రాష్ట్ర పరిస్థితి దివాలా తీయడానికి కేసీఆర్ ఎంత కారణమో కాంగ్రెస్ కూడా అంతే కారణ మని ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యోగులు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్స్, చిన్న పెద్ద కాంట్రాక్టర్లకి ఎంత బిల్లు లు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. B ట్యాక్స్ వసూలు చేయడం తో చిన్న కాంట్రాక్టర్ లు సచివాలయంలో ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రజలని ఉద్యోగస్తుల పై ఉసిగొల్పి ఏం సాధిస్తారు.
మీకు చేత కాకపోతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. మీరు రాజీనామా చేసి ప్రజా తీర్పుకు రండి అని ఆయన విమర్శించారు. ఆర్ధిక ఎమర్జెన్సీ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని, అన్ని ఎగ్గొట్టేందుకు సీఎం ఆర్ధిక అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా మెడలు వంచి చేయిస్తాంమని హెచ్చరించారు. ఉద్యోగుల సమస్యలు ఎవరకి చెప్పుకుంటారు సీఎం కి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారని ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Also Read: CM Revanth on BRS: బీఆర్ఎస్ పాలన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చింది.. సీఎం రేవంత్ రెడ్డి!