sandhya sridhar rao
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Sandhya Sridhar: సంధ్య శ్రీధర్ మామూలోడు కాదు.. హైడ్రా దూకుడుతో బయటకొస్తున్న బాధితులు!

  • 20 ఎకరాల ఎఫ్‌సీఐ లే ఔట్‌లో అక్రమ నిర్మాణాలు
  • తానే బతకాలి.. ప్లాట్ ఓనర్స్ ఇళ్లు కట్టొద్దని బెదిరింపులు
  • రోడ్లు, పార్క్ ప్లేస్‌లు సైతం కబ్జా
  • ఎన్ని కేసులు అయినా ఆగని భూ దాహం?
  • హైడ్రా మెరుపు దాడితో శ్రీధర్ బండారమంతా బట్టబయలు
  • ఇన్నాళ్లకు తమ న్యాయం జరిగిందంటున్న బాధితులు

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం


Sandhya Sridhar: సంధ్య శ్రీధర్ రావు.. అలియస్ సరనాల శ్రీధర్ రావు. ఈయన పేరు వింటేనే సగం మంది బిజినెస్‌మెన్స్ భయపడతారు. నమ్మించి కోట్లాది రూపాయలు మోసం చేయడం, క్లియర్ ప్రాపర్టీని లిటిగేషన్‌లోకి నెట్టడంలో ఈయన దిట్ట అని రియల్ రంగంలో తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తికి నాలుగున్నర ఎకరాల సొంత భూమి పక్కన 20 ఎకరాల మధ్యతరగతి కుటుంబాల ప్లాట్స్ ఉంటే ఉండనిస్తాడా? బెదిరింపులకు పాల్పడి, దొంగ పత్రాలు సృష్టించి 164 ప్లాట్స్‌లో 100 ప్లాట్స్ కొనుగోలు చేశాడు. బాధితులు తమ ప్లాట్స్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. పోలీసులు కొన్ని కేసులు మాత్రమే పెట్టారు. మచ్చుకగా ఎప్ఐఆర్ నెంబర్స్ 248/2018, 1215/2021, 1265/2021, 1791/2024.

2 లక్షలకు గజం భూమి కూడా దొరకదు


గచ్చిబౌలి (Gachibowli) సర్వే నెంబర్ 124, 125లో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు 1981లో హౌజింగ్ సొసైటీగా ఏర్పాటు చేసుకుని 20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సేల్ డీడ్ నెంబర్ 4453/1981. మొదటగా 158 ప్లాట్స్‌గా లే ఔట్ వేశారు. ఆ తర్వాత 162గా మార్చారు. ఇలా 110 ప్లాట్స్ మొదటి లే ఔట్ ఆధారంగా, 47 ప్లాట్స్ రెండో లే ఔట్‌తో పాటు 5 ప్లాట్స్ కామన్ ఏరియాగా ఉంచుకున్నారు. ఈ రెండు లే ఔట్స్‌పై సొసైటీ యాక్ట్ ప్రకారం నడుచుకోలేదనే ఫిర్యాదులు రావడంతో ఇంటి నిర్మాణాలకు అనుమతి రాలేదు. దీంతో పక్కనే ఉన్న సంధ్య కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు (Sridhar Rao) ఆ భూమిపై కన్నేశాడు. మీకు అనుమతులు రావు అంటూ ఒక్కొక్క ప్లాట్‌ను తక్కువ ధరకు తీసుకుని ముందున్న రోడ్డుని కబ్జా చేసి ఆ తర్వాత ప్లాట్స్ వారికి దారి లేకుండా చేశాడు. దీంతో పాటు అనుమతులు రాకుండా తన ధన బలంతో అడ్డుకోవడంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఏమీ చేయలేక 100 ప్లాట్స్ వరకు శ్రీధర్ రావుకే 2 లక్షలకు గజం ధర ఉంటే 50 వేలకు అమ్మేసుకున్నారు. కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుని పొజిషన్ తీసుకుని చాలా రోజుల తర్వాత డబ్బులు ఇచ్చాడని బాధితులు వాపోతున్నారు. ఇలా మొత్తం 18 వేల గజాల రోడ్డుని ఇష్టానుసారంగా వాడుకోవడంపై హైడ్రా (Hydra) కు ఫిర్యాదులు అందాయి. సొసైటీలోని ఉద్యోగులు చాలా మంది చనిపోవడం, వాళ్ల వారసులు వదిలేయడంతో శ్రీధర్ రావు పంట పండింది. ప్రైం ఏరియాలో 30 ఎకరాలు ఉందని అందరికీ చూపించి బురడీ కొట్టేంచేవాడని సన్నిహితులు చెబుతుంటారు.

హైడ్రాకు థ్యాంక్స్

నా పేరు రమ్య శ్రీ. నాకు 500 గజాల ఇంటి స్థలం ఉంది. ప్లాట్ నెంబర్ 134. శ్రీధర్ రావు ఎంట్రీ కాక ముందుకు మా ప్లాట్‌కు హద్దులు ఉండేవి. అప్పుడప్పుడు చూసుకునే వాళ్లం. అతను ఒక్కొక్క ప్లాట్ కొనుగోలు చేసుకుంటూ హద్దురాళ్లు తీసేశాడు. తర్వాత మాది ఇక్కడ ఉందని కూడా గుర్తు పట్టకుండా చేశాడు. సిమెంట్ బ్రిక్స్ కంపెనీ పెడితే, దాన్ని కష్టపడి తీసివేశాం. అప్పటి నుంచి మాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. పబ్లిక్‌గా ఇంత మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారని ఇన్నాళ్లూ బాధపడే వాళ్లం. హైడ్రా కమిషనర్ ఇప్పుడు చేసిన కూల్చివేతలతో మాకు ధైర్యం వచ్చింది. గతంలో అధికారులను మేనేజ్ చేసి ఇంత మందిని మోసం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని రోజూ తిట్టుకునేవాళ్లం. 2 నెలలుగా హ్రైడా కమిషనర్ ఫాలో అప్ చేశారు. రాత్రి 11 గంటల వరకు ఇరు వాదనలు వినేవారు. ఏం జరిగిందో ఓపిగ్గా తెలుసుకున్నారు. మా బాధను హైడ్రా కమిషనర్ మాత్రమే అర్ధం చేసుకుని మంచి చేశారు. మాకు ఏది వద్దు మా ఇంటికి దారి ఇవ్వండి ప్లీజ్ అంటూ 15 మంది బాధితులు తిరిగాం. మాకు న్యాయం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం. ఇంతటితో వదలకుండా పూర్తి అయ్యేలా చేయాలి. శ్రీధర్ రావు చట్టంలో లొసుగులను వాడుకుని ఇలా చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. కమిషనర్ కమిటిమెంట్‌కు నేను చాలా సంతోషంగా ఉన్నాను. హైడ్రా అంటే ఏమో అనుకున్నాను. కానీ, ఆయన పట్టుదల, పరిశీలన, పరిశోధన, ఓపిక, తీరుతో అర్థం అయింది. – రమ్య శ్రీ, బాధితురాలు

పాత లే ఔట్ వేయాలి

ఏండ్లుగా ఎదురుచుస్తున్న మాకు హైడ్రాతో న్యాయం జరిగింది. అసలు మాటల్లో చెప్పలేనంత ఉపశమనం లభించింది. చాలా సంవత్సరాల నుంచి శ్రీధర్ రావుతో 160 కుటుంబాలు బాధపడుతున్నాయి. రోడ్లను, ప్లాట్స్‌ను మిక్స్ చేసి గ్రౌండ్‌లాగా మార్చేశాడు. మా ప్లాట్ ఉందని అక్కడికి వెళితే బౌన్సర్స్‌ను పెట్టి బెదిరింపులకు పాల్పడేవాడు. రిటైర్డ్ ఉద్యోగుల ఇంటికి వెళ్లి అమ్మకపోతే మీ కుటుంబం అంతు చూస్తానని బెదిరించేవాడు. 2 లక్షల ధర ఉంటే 20 వేలకు ఇస్తావా, తడాఖా చూపించాలా అని బెదిరింపులకు పాల్పడేవాడు. అతను సృష్టించిన భయంతో ఎందుకొచ్చిన గొడవల్లే అని అమ్మేసుకున్న వారు వంద మంది దాకా ఉంటారు. అతని ప్లాట్స్‌కు రోడ్లు, అనుమతులు ఇప్పించుకునే వాడు. మిగితా వారిని దరిదాపుల్లోకి రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు హైడ్రాతో చాలా ధైర్యం వచ్చింది. న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. మాకు మా పాత లే ఔట్ ఆధారంగా రోడ్లు వేస్తే జీవితాంతం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ప్రశాంత్ ప్లాట్ ఓనర్

శ్రీధర్ రావు మోసగాడు

నాకు మా సొసైటీ 88 నెంబర్ ప్లాట్‌ను కేటాయించింది. 454 గజాలు. 2019లో నాకు డెవలప్‌మెంట్‌కు ఇవ్వండి అంటూ శ్రీధర్ రావు మా ఇంటికి వచ్చాడు. అగ్రిమెంట్ చేసుకున్నాం. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు 10 మంది బౌన్సర్స్‌తో వచ్చి లోనికి వెళ్లకుండానే బయట సంతకాలు పెట్టించాడు. రోడ్లు రద్దు కావాలంటే అమాలిష్మెచ్ చేయాలని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకుండా ఫేక్ సంతకాలతో పవర్ ఆఫ్ అటార్నీ అని తయారు చేసుకుని, అతని భార్య సంధ్య పేరు మీదుగా సేల్ డీడ్ చేసుకున్నాడు. సోమవారం కూడా నాకు డబ్బులు ఇస్తాను అని మెసేజ్ చేశాడు. ఏడాదిన్నరగా ఇదిగో అదిగో అని పబ్బం గడుపుతున్నాడు. రోజూ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు తప్పా ఒప్పుకున్న 4 కోట్లలో 4 వందలు కూడా ఇవ్వలేదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధడుతున్నాను. మా విజయవాడ వాడు, మా కులమని నమ్మినందుకు, నన్ను రోడ్డు పాలు చేశాడు. అతనితో ఫైట్ చేసే స్తోమత నాకు లేదు. హైడ్రా కూల్చివేత వార్త విన్న తర్వాత నాకో ధైర్యం వచ్చింది. ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. – వల్లూరు సాంబశివరావు, శ్రీధర్ రావు బాధితుడు

శ్రీధర్ వల్లే నా భర్త ఆత్మహత్య

హైడ్రా చ‌ర్య‌ల‌తో ధైర్యాన్ని కూడ‌గ‌ట్టుకున్న‌బాధితులు వివిధ మార్గాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. న‌గ‌రంలో ఉన్న‌వారే కాకుండా, విదేశాల్లో ఉన్న‌వారు కూడా హైడ్రాకు ఆన్ లైన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. త‌మ‌ను లే ఔట్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని, తమ ప్ర‌మేయం లేకుండా డెవ‌ల‌ప్‌మెంట్ అగ్రిమెంట్లు రాయించుకుని, నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. విదేశాల నుంచి మెయిల్స్‌తో పాటు వీడియో రూపంలో వారి గోడును వెల్లిబుచ్చుకున్నారు. అక్క‌డ తాము కొనుగోలు చేసిన ప్లాట్ లేద‌ని శ్రీ‌ధ‌ర్ రావు మ‌నుషులు చెప్ప‌డంతో త‌న భ‌ర్త ఆత్మ‌హ‌త్య చేసుకున్నారంటూ ఢిల్లీ నుంచి ఓ మ‌హిళ ఆన్‌ లై‌న్‌లో ఫిర్యాదు చేసినట్లు హైడ్రా వివరించింది. త్వ‌ర‌లో హైద‌రాబాద్ వ‌చ్చి నేరుగా ఫిర్యాదు చేస్తానని తెలిపింది. ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా హైడ్రాను సంప్ర‌దిస్తున్నారు. – ఢిల్లీకి చెందిన మహిళ

Read Also- Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు!

మరికొందరు ప్లాట్ ఓనర్స్ బాధ

ఇలాంటి రోజు కోసమే ఎన్నో ఏండ్లుగా భయపడుకుంటూ అయినా ప్లాట్ అమ్ముకోకుండా బతికాం. ఇప్పుడు న్యాయం జరిగింది అనుకుంటున్నాం. ఇలాంటి కబ్జాకోరుని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వానికి, హైడ్రాకు రుణపడి ఉంటాం. మాకు పూర్తి హక్కులు ఉన్నాయి. అనుమతులు వచ్చేలా, చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది.

బయటపడ్డ శ్రీధర్ రావు బండారం

ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడం వలనే సాంబశివరావు అనే వ్యక్తి తనపై కక్షగట్టి ఫిర్యాదులు చేశాడని శ్రీధర్ రావు అంటున్నాడు. ఏదైనా కోర్టులో తేల్చుకుంటానని మీడియాకు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి 12 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్స్ కొనిపించారని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై గతంలో ఈయన ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని సిట్ భావించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు దగ్గర అయ్యేందుకే పిటిషన్స్, ఫిర్యాదులు అంటూ శ్రీధర్ రావు హడావుడి చేశాడు. చివరకు హైడ్రా కూల్చివేతలతో ప్రభుత్వ పెద్దలకు అతనికి ఏ మాత్రం సంబంధం లేదని తేలిపోయిందని రియల్ ఎస్టేట్, పొలిటికల్ వర్గాల్లో స్పష్టత వచ్చింది.

Read Also- Allegations on GHMC: గులాబీ పాలన హయాంలో అక్రమ నియామకాలు.. కొత్త సర్కారుకు ఎదురైన సవాళ్లు!

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్