Duvvada Srinivas: ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి(Divvela Madhuri)ల జంట గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో (Social Media) ఈ జంట ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఒకటా రెండా ఓ వైపు వీడియోలతో మాధురి, మరోవైపు పొలిటికల్ కామెంట్లతో దువ్వాడ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇక ప్రియురాలితో (Duvvada Lover) కలిసి దువ్వాడ ఇచ్చే ఇంటర్వ్యూలు అబ్బో మాటల్లో చెప్పలేం.. ఆ చేష్టలు చేతల్లో రాయలేం. నోరు తెరిచి ఏం మాట్లాడినా అదో సెన్సేషన్ అవుతోంది. వీరి ఇంటర్వ్యూ కోసం చిన్నా చితకా యూట్యూబ్ ఛానెల్స్ మొదలుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకూ క్యూ కడుతున్నాయంటే అర్థం చేసుకోండి. ఇటీవలే సరికొత్తగా ‘కాంచీపురం వకులా సిల్క్స్’ (Kanchipuram Vakula Silks) అంటూ వస్త్ర రంగంలోకి అడుగుపెట్టేశారు కూడా. బిజినెస్ పరంగా, వ్యక్తిగతంగా అటుంచితే ఇప్పుడు రాజకీయ పరంగా దువ్వాడ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. అంతలా ఎందుకు చర్చించుకుంటున్నారు? వీళ్లు చేసిన ఆ ఘనకార్యం ఏంటబ్బా? అనే కదా మీ సందేహం.. ఇంకెందుకు ఆలస్యం ‘స్వేచ్ఛ’ స్పెషల్ స్టోరీని చకచకా చదివేయండి మరి..
Read Also- India And Pak Tension: ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి.. ఈలోపే కీలక పరిణామం
వైసీపీని వద్దనుకున్నట్టేనా..?
వైసీపీ (YSRCP) నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను ఈ మధ్యనే సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. భార్యాపిల్లలతో గొడవలు, ప్రియురాలి రచ్చ నేపథ్యంలో పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా వైసీపీ నుంచి హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ పరంగా కాకుండా ఎమ్మెల్సీగా మాత్రం పదవీకాలం ముగిసేవరకూ ఆయన కొనసాగుతారు. సస్పెన్షన్‌పై వీడియో రిలీజ్ చేసిన దువ్వాడ ఎక్కడా పార్టీని కానీ, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కానీ ఒక్కమాట కూడా విమర్శించలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో మళ్లీ పార్టీ నుంచి పిలుపు వస్తుందన్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ గ్యాప్‌లోనే ఏమైందో తెలియట్లేదు కానీ వైసీపీని, వైఎస్ జగన్ రెడ్డిని పూర్తిగా వద్దనుకొని పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలియవచ్చింది. అతి త్వరలోనే పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు తాజాగా చోటుచేసుకున్న ఒకే ఒక్క పరిణామమే అని చర్చ సాగుతోంది. ఆ పరిణామం కూడా మరేంటో కాదు దువ్వాడ, దివ్వెల కలిసి గ్రీన్ ఇండియా హరితసేనలో భాగంగా మొక్కలు నాటడమే.

Read Also- Chamala Kiran: కేటీఆర్‌కు మైండ్ దొబ్బింది.. చామల షాకింగ్ కామెంట్స్
ఇదీ అసలు సంగతి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఇప్పటికీ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే దువ్వాడ తన ప్రియురాలితో కలిసి హైదరాబాద్‌లోని ఓ పార్కులో రెండు వేప మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, దువ్వాడ-దివ్వెల అభిమానులు చిత్రవిచిత్రాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు హరితసేనలో పాల్గొనని దువ్వాడ ఇప్పుడే ఎందుకు పాల్గొన్నారు? అయినా ఏపీకి చెందిన వ్యక్తి ఇక్కడ చేయాల్సిన అవసరమేంటి? బీఆర్ఎస్‌ను కాకా పట్టాల్సిన అవసరమేంటి? హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నారు గనుక సపోర్టు కోసం ఇలా చేస్తున్నారా? లేకుంటే మరో కారణమేమైనా ఉందా? అని నెటిజన్లు, అభిమానులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఇక ఫ్యాన్ పార్టీ, అధినేతను కాదనుకొని బీఆర్ఎస్‌లో (BRS) చేరి కొద్దిరోజులు ‘కారు’లో షికారు చేయడానికి దువ్వాడ, దివ్వెల రెడీ అయినట్లుగా తెలుస్తున్నది. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఏపీలో బీఆర్ఎస్ తరఫున కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Read Also- Earthquake: ఏపీని భయపెట్టిన భూకంపం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
‘కారు’కు దిక్కెవరు?
టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతూ వస్తున్నాయి. అప్పటి వరకూ ఏపీలో పార్టీ కార్యక్రమాలు జరిగాయి కానీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ గుడ్ బై చెప్పాక పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే దువ్వాడ.. బీఆర్ఎస్ దొరికారని, త్వరలోనే ఆ అధ్యక్ష పదవి కట్టబెట్టొచ్చనే టాక్ గట్టిగానే నడుస్తోంది. అందుకే బీఆర్ఎస్‌కు దగ్గరయ్యేందుకు పక్కా ప్లాన్‌తోనే ఇలా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తున్నది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే దువ్వాడ, దివ్వెల స్పందిస్తే కానీ తెలిసే అవకాశాలు కనిపించట్లేదు.
మాజీ రాజ్యసభసభ్యులు @SantoshKumarBRS గారి గ్రీన్ ఇండియా హరితసేనలో భాగంగా మొక్కలు నాటిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారు మరియు దివ్వెల మాధురి గారు.#harithasena#haritha_sena#Greenindiachallenge@BRSparty@RaghavBRS pic.twitter.com/rcujvn8KTo
— Haritha Sena (@Haritha_Sena) May 6, 2025