Mulugu Corruption case: ములుగు జిల్లా కేంద్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులునిర్వహించారు. ములుగు జడ్పీ కార్యాలయంలో అవినీతి అధికారుల హల్చల్ నడుస్తుందని వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అవినీతికి పాల్పడిన సూపరింటెండెంట్ సుధాకర్ రూ.25,000 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి సత్సంబంధాలతో అనుమానం ఉన్న జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Korsa Narasimha Murthy: బహుళజాతి కంపెనీల తప్పుడు అగ్రిమెంట్లు.. రైతుల నష్టాలకు న్యాయం ఎప్పుడు?
తోటి ఉద్యోగి ద్వారా లంచం తీసుకునే సమయంలోనే అధికారులు సుధాకర్ ను పట్టుకున్నారు. ఇప్పటికే ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలోనూ సింగరేణి హెడ్ ఆఫీస్ లో పనిచేసే డ్రైవర్ అన్న బోయిన రాజేశ్వరరావును ఏసీబీ డిఎస్పి వై రమేష్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాజేశ్వరరావు బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలను తనిఖీ చేస్తున్నట్లుగా సమాచారం.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు